బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైనా విజయ్ అంటోని కోమాలోకి వెళ్ళారు. బిచ్చగాడు సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం బిచ్చగాడు 2 తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ సన్నివేశం తెరకెక్కిస్తుండగా విజయ్ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
మలేషియాలో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ఓ బోట్ సన్నివేశం తెరకెక్కిస్తుండగా ఎదురుగా వస్తున్న మరో బోట్ ఢీకొట్టడం వల్ల విజయ్ ఆంటోనీ బోట్ నుండి ఎగిరి క్రిందపడ్డాడు.అందువల్ల ఆయన తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
వెంటనే మూవీ యూనిట్ విజయ్ ను సమీపంలోని హాస్పిటల్ కి తరలించి అత్యవసర చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు మాట్లాడుతూ ‘విజయ్ ఆంటోనీ కి దవడ ఎముక మరియు పళ్ళు విరిగిపోయాయి..ముఖానికి కూడా దెబ్బలు తగిలాయి..చికిత్స అందిస్తున్నాము..ప్రస్తుతం ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు’ అని చెప్పడం తో అభిమానులు రిలాక్స్ అయ్యారు..తమ అభిమాన హీరో త్వరగా కోలుకొని సురక్షితంగా బయటకి రావాలని ప్రార్థించారు.
ఇదిలా ఉండగానే విజయ్ అంటోని భార్య మాట్లాడుతూ… విజయ్ ఆరోగ్యం విషమంగా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నాడని.. ఆయన్ని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని ఫాతిమా చెప్పడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.