25మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశం అయ్యాయి. వారిని మార్చితే అధికారం మరోసారి బీఆర్ఎస్ దేనని వ్యాఖ్యానించారు. ఆ 25మంది ఎమ్మెల్యేలు వీరేనంటూ పలువురి ఎమ్మెల్యేల పేర్లు బయటకొచ్చాయి. దాంతో ఎర్రబెల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఆ నేతలంతా హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
సిట్టింగ్ లకే మరోసారి టికెట్లు అంటూ కేసీఆర్ ప్రకటిస్తుంటే..మంత్రి ఎర్రబెల్లి మాత్రం అందుకు విరుద్దంగా కామెంట్స్ చేయడం పట్ల ఆ 25మంది ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది. ఎర్రబెల్లి పరిధి దాటి కామెంట్స్ చేస్తున్నారని..ఆయన చేసిన వ్యాఖ్యల వలన తాము ఓడిపోయే నేతలమంటూ నియొజకవర్గాల్లో ప్రచారం జరిగిందని హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. మంత్రిని నియత్రించాలని 25 మంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో కేసీఆర్ ఎర్రబెల్లికి క్లాస్ పీకినట్లు సమాచారం.
అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని , అత్యుత్సాహం ప్రదర్శించవద్దని ఎర్రబెల్లికి ఫోన్ చేసి కేసీఆర్ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. పరిమితికి లోబడి వ్యాఖ్యలు చేయలని.. గీత దాటోద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. చివరకు తన మాటలను మీడియా వక్రీకరించిందని ఎర్రబెల్లి మాట మార్చినట్లు చర్చ జరుగుతోంది.
Also Read : 20స్థానాల్లో ఎమ్మెల్యేలను మార్చాలి – ఎర్రబెల్లి అంటోన్న ఆ ఎమ్మెల్యేలు వీరేనా..?