పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాదాపు బీఆర్ఎస్ తో అనుబంధం తెంచుకున్నారు. దాంతో ఆయన పొలిటికల్ జర్నీ ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది. ఖమ్మం రాజకీయాలను పూర్తిగా పొంగులేటి చేతిలో పెట్టేందుకు బీజేపీ అంగీకరించడంతో ఆయన బీజేపీలో చేరేందుకు రెడీ అయిపోయారని ప్రచారం జరిగింది.
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపగలిగే పొంగులేటి కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నించారు. కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు. కాని ఆయన చేరికకు భట్టి అడ్డుపతున్నారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే భట్టి మాట్లాడుతూ..పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికకు తాను అడ్డుకాదని.. ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ లో పొంగులేటి చేరుతానంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని భట్టి ప్రకటనతో పొంగులేటి, ఆయన సన్నిహిత నేతలు ఆలోచనలో పడ్డారు. అనుచరులతో వరుసగా సమావేశం అవుతు పొంగులేటి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఐతెహ్, అనుచరుల నుంచి కాంగ్రెస్ లో చేరాలనే విజ్ఞప్తులు ఎక్కువగా వచ్చినట్లు సమాచారం.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరికకు పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. అనుచరుల నుంచి వ్యతిరేకత రావటంతో ఆయన డైలమాలో పడిపోయారు. రాజకీయ భవిష్యత్, జిల్లాలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటుందని అనుచరవర్గం పొంగులేటికి చెప్పినట్లు తెలుస్తోంది.
పొంగులేటి బీజేపీలోకి చేరుతారనగానే కార్యకర్తలు ఎవరు అతని ఆఫీస్ వైపు వెళ్ళడం లేదు. ఖమ్మంలో అసలు ఉనికి లేని బీజేపీలో చేరితే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పొంగులేటితో అన్నట్లు సమాచారం. ఆయనకు అత్యంత సన్నిహిత నేతలైన కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు లాంటి ముఖ్య నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్తేనే పొలిటికల్ ఫ్యూచర్ బెటర్ ఉంటుందని చెప్పడంతో పొంగులేటి బీజేపీలో చేరికపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తేవాలని తెరవెనక చక్రం తిప్పుతున్నారు. అనుచరులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు ముగిసాక కాంగ్రెస్ లో చేరికపై పొంగులేటి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Also Read : రేవంత్ తో చేతులు కలిపిన కోమటిరెడ్డి – పార్టీలో నయా జోష్