నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. కొత్త రాష్ట్రంలో సహజంగానే పాలకుల నుంచి ప్రజలు కొత్తదనాన్ని ఆశిస్తారు. సంక్షేమ, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధిని కోరుతుంటారు. ఉద్యమాలతో సాధించుకున్న రాష్ట్రం కాబట్టి.. స్వతహాగానే తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని అందరూ ఆశిస్తారు. కాని మన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య హంతకుడిగా చరిత్రలోకెక్కుతున్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ బలిష్టంగా ఉండేందుకు పక్కపార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసీఆర్… ఇప్పుడు తనచూపును జాతీయ రాజకీయాల్లోకి మళ్ళించడంతో ఇతర రాష్ట్రాల్లోని నేతలతో బేరసారాలు నడుపడంపై కేంద్రీకరించారు. కర్ణాటకకు చెందిన 25మంది కాంగ్రెస్ నేతలను తన ఫామ్ హౌజ్ కి పిలిచి వారికీ 500కోట్ల ఆఫర్ చేశారు కేసీఆర్. వారంతా గెలిచే నేతలని తెలియడంతో కేసీఆర్ ఈ విధమైన నీచరాజకీయాలకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో ప్రజల తీర్పును అపహాస్యం చేస్తూ ప్రజా ప్రభుత్వాలను కూల్చిన బీజేపీకి కంటే తనేం తక్కువ కాదనుకున్నారో ఏమో కాని బీజేపీ విష రాజకీయాల సంస్కృతిని తాను కొనసాగిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ నుంచి సుపారీ తీసుకున్నారో ఏమో కాంగ్రెస్ ను కిల్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ నేతలకు 500కోట్లు కేసీఆర్ ఆఫర్ చేశారని అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నిజానికి.. రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేయరు. ఆధారాలు ఉంటేనే ఇలాంటి విషయాల్లో ఆయన ఆరోపణలు చేస్తారు. పైగా.. తను చెప్పింది నిజం కాకపోతే ఖండించాలని డిమాండ్ చేస్తే కేసీఆర్ కాదు కదా. ఆయన ఫామ్ హౌజ్ పాలేర్లు కూడా ఖండించకపోవడం గమనార్హం. అంటే.. ఇదంతా వ్యూహంలో భాగంగా జరుగుతుందని అర్థం అవుతుంది. తెలంగాణ అభివృద్ధిని గాలికి వదిలి, ప్రజాసామ్యయుతంగా పాలన కొనసాగిస్తాడనుకున్న కేసీఆర్.. దేశమంతా తెలంగాణను చూసి అసహించుకునేలా వ్యవహరిస్తుండటం విషాదం. కేసీఆర్ నీచ రాజకీయాలు వెలుగులోకి వస్తుండటంతో “థూ నీ బతుకు చెడ” అనే ఆయన డైలాగ్ ను తిరిగి కేసీఆర్ పైనే ప్రయోగిస్తున్నారు.
Also Read : కేసీఆర్ అస్త్రం తెలంగాణ కాదిప్పుడు – కొత్త సెంటిమెంట్ తో..!
Also Read : కర్ణాటకతోపాటే తెలంగాణలోనూ ఎన్నికలు