తెలంగాణ బీజేపీలో ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరుకుంది. బండి సంజయ్, ఈటల మధ్య అసలు పొసగడం లేదు. ఈ క్రమంలోనే వివేక్ – ఈటల డబ్బు వ్యవహారాన్ని బండి సంజయ్ అగ్రనేతలకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈటల తనేమి తక్కువ కాదని.. బండి సంజయ్ కు చెక్ పెట్టేందుకు బండి భగీరధ్ వ్యవహారాన్ని అధిష్టానం వద్దకు తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. ఇద్దరు కీలక నేతల పోటాపోటీ ఫిర్యాదులతో అధిష్టానం ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు జరుపుతోంది.
ఈటల బీజేపీలో చేరిన నాటి నుంచి బండి సంజయ్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత ఈటలను అగ్రనేతలు అభినందించి.. ఆకాశానికేత్తేయడం బండి కు అస్సలు రుచించలేదు. ఇది చాలదన్నట్లు.. బీజేపీ సీఎం క్యాండిడేట్ ఈటల అంటూ ఆయన వర్గీయులు ప్రచారం మొదలెట్టారు. ఈ విషయం బండి సంజయ్ కు తెలియడంతో పార్టీలో ఈటలకు క్రమక్రమంగా ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. దీంతో పార్టీ కార్యక్రమాల్లో ఈటల పాల్గొనడం అరుదుగా కనిపిస్తోంది. తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని.. అందుకే నియోజకవర్గానికే పరిమితం అవుతున్నానని ఈటల తన సన్నిహితుల వద్ద చెప్పుకున్న విషయం సంచలనంగా మారింది.ఈ క్రమంలోనే వచ్చే నెలలో బండి సంజయ్ అద్యక్ష పదవి కాలం ముగియనుందని..ఆయన స్థానంలో ఈటలకు ఈ బాధ్యతలను కట్టబెట్టనున్నారని ఈటల వర్గం ప్రచారం చేసుకుంటుంది. అసలే ఈటలపై ఆగ్రహంగా ఉన్న బండి సంజయ్ కు ఈ ప్రచారం మరింత కోపాన్ని తెప్పించింది.
ఈటలను పార్టీలో బలహీనం చేసినా.. అగ్రనేతల వద్ద ఆయనపై మంచి ఇంప్రెషన్ ఉందని బండికి తెలుసు. కాబట్టి ఆ ఇంప్రెషన్ పోగొట్టేందుకు వివేక్ వద్ద ఈటల తీసుకొన్న 10కోట్ల రూపాయలు ఎగనామం పెట్టేందుకు ఈటల ట్రై చేస్తున్నారని..ఈ విషయాన్నీ తాజాగా బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ కు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. అంతకుముందే.. ఈ విషయాన్ని బండి సంజయ్ కి వివేక్ ఫిర్యాదు చేయగా.. దొరికిందే ఛాన్స్ అని సునీల్ బన్సల్ దృష్టికి సంజయ్ తీసుకెళ్ళారు. అంతేకాదు.. మరికొంతమంది నేతలకు ఎన్నికల్లో సాయం చేస్తానని నమ్మించి పార్టీకి చేటు తెచ్చేలా ఈటల వ్యవహరిస్తున్నారని కంప్లైంట్ చేసినట్లు బీజేపీ వర్గాలు అంటున్నాయి.
సునీల్ బన్సల్ కు బండి ఫిర్యాదు చేశారని తెలియగానే.. ఈటల కూడా పోటీగా ఫిర్యాదు చేశారు. మహేంద్ర కాలేజ్ వ్యవహారంలో బండి సంజయ్ కొడుకు వ్యవహరించిన తీరుతో పార్టీ ఇమేజ్ దెబ్బతిందని..బీజేపీ స్టేట్ చీఫ్ కొడుకు రౌడీ అంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేసుకున్నాయని ఫిర్యాదు చేశారు. ఇది పార్టీకి ఇబ్బందిక ల్గించే పరిణామమేనని వివరించారు. కరీంనగర్ జిల్లాలో మైనింగ్ వాళ్ళ దగ్గర సంజయ్ వసూళ్ల గురించి కూడా ఈటెల ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలాగే, బండి సంజయ్ ఆయన వర్గం నేతలకే అధిక ప్రాధాన్యత ఇస్తు ఇతర నేతలను అసలు పట్టించుకోవడం లేదని.. బండి సంజయ్ ను ఈ విషయమై హెచ్చరించాలని కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు ఈ కీలక నేతల మధ్య ఆధిపత్యపోరు పార్టీని ఎలాంటి సంకటస్థితిలోకి తీసుకేళ్తుందోనని టెన్షన్ పడుతున్నారు.
Also Read : నా 10కోట్లు ఇవ్వవా..? ఈటలను నిలదీసిన వివేక్