రాత్రి, పగలు అనేవి సాధారణం. అవి లేకుండా కాలగమనం ఉండదు. ఉదయం సూర్యుడు, రాత్రి చంద్రుడు కనిపిస్తుంటాడు. కాని రాత్రి అనేది లేని ఓ ప్రాంతముందని మీకు తెలుసా..? రాత్రి లేకుండా ఉండటమేంటని ఆశ్చర్య పోకండి. నిజంగా ఆ ప్రాంతంలో రాత్రి అనేదే ఉండదు.
ఒక్కో ప్రాంతంలో భిన్నమైన వాతావరణం ఉంటుంది. అలాంటి భిన్నమైన వాతావరణం కల్గిన ఓ ప్రదేశం ఉంది. అక్కడ రాత్రి అనేది ఉండదు. అంత పగలే. అర్దరాత్రి సమయం ఉంటుంది కాని సూర్యుడు అలాగే దర్శనమిస్తాడు.
రాత్రి సమయంలో ఉండాల్సిన చంద్రుడుకు బదులుగా సూర్యుడే ఉంటాడు.అక్కడ రోజుకు 24 గంటలూ సూర్యుడే కనిపిస్తాడు. ఆ అరుదైన అద్భుతమైన ప్రదేశం నార్వే దేశంలో ఉంది. సాధరణంగా ఒక రోజుకు 24 గంటలైతే అందులో దాదాపు సగం పగలు, మిగతాది రాత్రి ఉంటుంది. ఇలా పగలు, రాత్రులు సమానంగా ఉంటేనే ఈ విశ్వం సక్రమంగా ముందుకు సాగుతుంది.
రోజులో కేవలం 40 నిమిషాలు మాత్రమే రాత్రి సమయం ఉండే ప్రదేశం ఈ భూమిపైనే ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. నార్వే దేశంలో రాత్రి కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇక్కడ సూర్యుడు రాత్రి 12.43 గంటలకు అస్తమిస్తాడు. మళ్లీ కేవలం 40 నిమిషాల తర్వాతే తిరిగి ఉదయిస్తాడు. అయితే..సంవత్సరమంతా అలా ఉండదు. సమ్మర్ సమయంలో దాదాపు రెండున్నర నెలలు ఈ దేశంలో వాతావరణం ఇలా వింతగానే ఉంటుంది.
అందుకే నార్వేను ‘కంట్రీ ఆఫ్ మిడ్‌నైట్ సన్’ అని పిలుస్తుంటారు. ఆర్కిటిక్ పరిధిలోకి వచ్చే నార్వేలో మే నుంచి జూలై మధ్యలో సుమారు 76 రోజుల పాటు సూర్యుడు ఇలా ఎక్కువసేపు ఉంటాడు.