పవన్ కళ్యాణ్, అలీ ప్రాణ స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేసే ప్రతి సినిమాలో అలీను పక్కన పెట్టుకునే వాడు. పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేసి రాజకీయాల బాట పట్టడం.. ఆ సమయంలో అలీకి సినీ అవకాశాలు తగ్గడంతో ఆయన వైసీపీలో చేరిపోయారు. ఇంకేముంది.. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాల్సి ఉంటుంది కదా..అందుకే అలీ కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ వలెనే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పడం సరైంది కాదని.. తన దగ్గర ఉన్న టాలెంట్ తోనే సినీ రంగంలో ఎదిగానని 2019 ఎన్నికల సమయంలో అలీ చెప్పేశారు. మళ్ళీ ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత స్నేహితుడిపైనే పోటీకి రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తానంటూ వ్యాఖ్యానించారు.
వైసీపీ అధినేత జగన్ ఆదేశిస్తే పవన్ పై పోటీకి సిద్ధమని ప్రకటించాడు. 2024లో వైసీపీ 175కి 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలీ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అలీ వ్యాఖ్యల వెనుక జగన్ ఎత్తుగడ ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సినీ రంగం నుంచి పవన్ ను డీకొట్టాలంటే ఆ రేంజ్ ఉన్న వారు ఉండాలని.. ఇందుకోసం జగన్ అలీని చూస్ చేసుకొని ఉంటారన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. అలీకి ఇటీవలే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలోనే పవన్ దూకుడు పెంచుతుండటంతో వ్యూహాత్మకంగా అలీని జగన్ రంగంలోకి దించారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి వరకు రాజకీయంగా పవన్ పై ఏనాడూ నోరు విప్పని అలీ తొలిసారిగా మాట్లాడారు. పవన్ తనకు మంచి మిత్రుడని కానీ సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని చెప్పారు. ఏపీకి ఎవరు ఏం చేశారనేది అందరికీ తెలుసు. జగన్ ఆదేశిస్తే ఎవరిపైనైనా పోటీ చేస్తానన్నారు. అలీ అనూహ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక వైసీపీ వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.