పెళ్లి కాకుండానే గర్భం దాల్చడం రానురాను ఫ్యాషన్ అయిపోతుంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఆడపిల్లకు జన్మనిచ్చింది. రణ్ బీర్ కపూర్ తో పెళ్లికి ముందే కాపురం చేసి పెళ్లి అయ్యాక ఐదు నెలలకే బిడ్డకు జన్మనిచ్చింది. క్రికెటర్ హార్దిక్ పాండ్యా విషయంలోనూ ఇదే జరిగింది. తాజాగా ఈ వరుసలో టాలీవుడ్ స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ చేరిపోయారు.
రాహుల్ రామకృష్ణ గత సంవత్సరం తన ప్రేయసిని పరిచయం చేశారు. హరిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నట్లు అనౌన్స్ చేశాడు. ఆ తరువాత అతని పెళ్లి గురించి ప్రకటనే వెలువడలేదు. ఇంతలోనే తండ్రిని అయ్యనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ”అబ్బాయి… సంక్రాంతి రిలీజ్” అని అప్పుడే పుట్టిన బిడ్డ ఫోటో షేర్ చేశాడు. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది
సోషల్ మీడియాలో పోస్టులు చేసి హాట్ టాపిక్ అవ్వడం రాహుల్ కు మొదటి నుంచే అలవాటే. గతంలో సినిమాలు మానేస్తున్నట్లు ఓ పోస్ట్ పెట్టాడు. ఆ మరుసటి రోజే డబ్బు, హోదా ఇచ్చే ఇంత లగ్జరీ లైఫ్ ఎవడైనా వదిలేస్తానా? నేను జస్ట్ జోక్ చేశా అని కామెంట్ పెట్టాడు. ఇలా రాహుల్ చేసిన ట్వీట్స్ విమర్శలకు గురవుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అలాగే సరదా కోసమే ఇలా చేశాడా..? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
Boy.
Sankranthi release. pic.twitter.com/SeU0Vo6BB1— Rahul Ramakrishna (@eyrahul) January 16, 2023
మరోవైపు.. తన ప్రేయసి హరితను రాహుల్ రామకృష్ణ రహస్యంగా వివాహం చేసుకున్నాడా అనే చర్చ జరుగుతోంది. సన్నిహితులు, బంధు మిత్రుల సమక్షంలో నిరాడంబరంగా హరితను వివాహం చేసుకున్నాడెమో అనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై రాహుల్ రామకృష్ణ మరింత క్లారిటీ బాకీ ఉన్నాడు.