మంత్రి హరీష్ రావు. కేసీఆర్ మేనల్లుడు. బీఆర్ఎస్ కీలక నేత. టీఆర్ఎస్ ఆవిర్భావం మొదలు బీఆర్ఎస్ వరకు కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తోన్న నేత. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పై ఈగ వాలకుండా చూసుకున్నారు. అందుకే ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏ రాజకీయ నిర్ణయం తీసుకుకోవాలనుకున్న హరీష్ రావును సంప్రదిన్చాల్సిందే. అలా ఉద్యమాన్ని పార్టీని సమన్వయము చేసుకుంటూ వచ్చిన హరీష్ కు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత కరువైపోతు వచ్చిందనేది ఆయన వర్గీయుల మాట.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మొదటగా సాగునీటి పారుదల శాఖను కట్టబెట్టారు కేసీఆర్. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. అలాగే, శాసన సభ వ్యవహారాల ఇంచార్జ్ గా కీలక బాధ్యతలను కట్టబెట్టారు కేసీఆర్. ఆ తరువాత ఆయనకు పార్టీలో పెరుగుతోన్న ఫాలోయింగ్ చూసి కేసీఆర్ కు భయం మొదలైందట. హరీష్ రావు దూకుడును కట్టడి చేయకపోతే కేటీఆర్ కు ఇబ్బంది అవుతుందని హరీష్ రావుతో సన్నిహితంగా ఉండే నేతలకు పదవులు ఇవ్వకపోవడం..వారిలో కొంతమందిని కేటీఆర్ తో టచ్ లోకి వెళ్ళడం వంటివి చేశారని హరీష్ వర్గీయుల్లో ప్రచారం ఉండనే ఉంది.
టీఆర్ఎస్ రెండోసారి ఆధికారంలోకి వచ్చాక హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కనపెట్టారు. కేటీఆర్ ను కూడా కొంతకాలం పక్కనపెట్టారు. అదంతా వ్యూహత్మకమేననేది అందరికీ తెలిసిన విషయమే. ఇక కీలకమైన శాసన సభ వ్యవహారాల మంత్రి బాధ్యతలను హరీష్ రావుకు ఇవ్వకుండా కవితతో సన్నిహితంగా ఉండే వేముల ప్రశాంత్ కు కట్టబెట్టారు కేసీఆర్. ఆ తరువాత టీ న్యూస్ లో, నమస్తే తెలంగాణలో కొన్నాళ్ళు ఆయన వార్తలు బంద్ పెట్టాలని ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు వెళ్ళినట్లు ప్రచారం జరిగింది. ఇదంతా పక్కనబెడితే..ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసేవరకు హరీష్ రావుకు పార్టీలో ప్రాధాన్యత లేదనేది బహిరంగ రహస్యమే. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటలను డీకొట్టాలంటే హరీష్ రావే సరైన నేత అని వ్యూహత్మకంగా హరీష్ ను దగ్గరికి తీశాడు కేసీఆర్.
అవసరానికి హరీష్ రావును చేరదీస్తూ.. పార్టీకి మైలేజ్ వస్తుందని భావించిన చోట మాత్రం కేటీఆర్ ను కేసీఆర్ రంగంలోకి దింపుతున్నారు కేసీఆర్. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఖమ్మం పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. పొంగులేటి బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఆయన బాటలో వెళ్లేందుకు తుమ్మల రెడీ అయినా చివరి నిమిషంలో ఆయన్ను దువ్వారు. టికెట్ పై హామీ ఇవ్వడంతోనే ఆయన మెత్తబడినట్లు చెప్తున్నారు.
పొంగులేటితోపాటు ఖమ్మం జిల్లా నేతలు పార్టీ మారిన ఆ ప్రభావం బీఆర్ఎస్ పై పడకుండా ఉండేందుకు హరీష్ రావును రంగంలోకి దింపారు కేసీఆర్. అయినా వారంతా బీఆర్ఎస్ ను వీడెందుకు సిద్దమైపోయారు. హరీష్ రావును రంగంలోకి దింపిన ఇప్పుడు ఎలాంటి ఫలితం ఉండదు. కేసీఆర్ కు కూడా ఈ విషయం తెలుసు. అయినా ఆయనకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం వెనక కేసీఆర్ మార్క్ రాజకీయం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బుధవారం ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. ఈ సభ ఇంచార్జ్ గా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. సభకు ఇంచార్జ్ బాధ్యతలు కట్టబెట్టినా నేతలను చేజారకుండా చేయాలనేది కేసీఆర్ ఆలోచన. దాంతో పొంగులేటితోపాటు మరికొంతమంది బీఆర్ఎస్ ను వీడితే అ నెపాన్ని హరీష్ రావుపై వేసేందుకు కేసీఆర్ మరోసారి హరీష్ కు బాధ్యతలు అప్పగించాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసంతృప్త నేతలు పార్టీ మారకుండా కట్టడి చేయడంలో ట్రబుల్ షూటర్ గా చెప్పుకున్న హరీష్ రావు ఫెయిల్ అయ్యాడని చెప్పేందుకు ఇలా చేసి ఉంటారని అంటున్నారు. హరీష్ సేవలను వినియోగించుకుంటూ ఆయనను డమ్మీగా మార్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.