కేసీఆర్ పై అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తోన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అస్సలు వెనక్కి తగ్గొద్దని నిర్ణయించుకున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు ఆయన ఝలక్ ఇచ్చారు. పార్టీని వీడుతున్నట్లు పరోక్షంగా ప్రకటించేశారు.
ఆదివారం ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో మార్పులు చేసి ఈమేరకు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. తన ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ నుంచి కేసీఆర్, కేటీఆర్ ఫోటోలను తొలగించేశారు. పార్టీ మారేందుకు సిద్దం అవుతున్నారనే వార్తల నేపథ్యంలోపొంగులేటి తన సోషల్ మీడియా ఖాతాలో కేసీఆర్ , కేటీఆర్ ల ఫోటోలను తొలగించడం హాట్ టాపిక్ గా మారింది.
మరోవైపు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోన్న వేళ ఖమ్మం సభకు ఇంచార్జ్ గా వ్యవహరిస్తోన్న మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బీజేపీలో చేరాలనుకునే వారి తమ గోతిని తామే తోవ్వుకున్నట్లని హరీష్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.
ఈ క్రమంలోనే పొంగులేటి తన ఫేస్ బుక్ ఖాతాలోని ప్రొఫైల్ పిక్ ఆప్డేట్ చేయడం తో ఖమ్మం బీఆర్ఎస్ లో రాజకీయం రసవత్తరంగా మారింది.