తొలి సినిమాతోనే నంది పురస్కారం అందుకున్న నటుడు రామిరెడ్డి.1989లో రాజశేఖర్ హీరోగా వచ్చిన అంకుశం సినిమాలో విలన్ గా నటించి ఈ ఆవార్డ్ పొందాడు. ఈ మూవీలోని క్యారెక్టర్ అందరికీ నచ్చడంతో ప్రతి నాయకుడిగా ఆయనకు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి.
అంకుశం సినిమాలో రామిరెడ్డి డైలాగ్ వినని వాళ్ళు, ఆ డైలాగ్ చెప్పని వాళ్ళు బహుశ ఎవరూ ఉండరేమో. అంతగా అప్పట్లో ఆ డైలాగ్ ఫేమస్ అయింది. స్పాట్ పెడ్తా.. ఇప్పటివాళ్లకు ఏమో కానీ 90వ దశకంలో ఈ డైలాగ్ విననివాళ్లు, అననివాళ్లు ఉండరు. ‘అంకుశం’ మూవీతో నటుడిగా పరిచయమయిన రామిరెడ్డి ట్రేడ్ మార్క్ డైలాగ్ ఇది.
ఆ చిత్రంలో విలన్ రోల్ తో మెప్పించాడు. విలన్ అంటే ఇలా చేయాలని ఆయనను చూసి ఎంతోమంది విలన్ క్యారెక్టర్ లు చేయాలనుకునే వారు నేర్చుకున్నారు. తెలుగు మాత్రమే కాదు అటు బాలీవుడ్లో సైతం సత్తా చాటారు. ఇక తమిళం, మలయాళం, కన్నడ, భోజ్‌పురి భాషల్లోనూ తన మార్క్ చూపించారు. 250కిపైగా చిత్రాల్లో విభిన్న పాత్రలతో మెప్పించారు రామిరెడ్డి. ఆయన చివరి చిత్రం ‘మర్మం’.
ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రలో కనిపించినా ‘పెద్దరికం’, ‘అనగనగా ఒక రోజు’ లాంటి సినిమాల్లో మాత్రం టిపికల్ రోల్స్ చేశారు. అనగనగా ఒక రోజు, అడవిచుక్క, నాగప్రతిష్ఠ, తెలుగోడు, జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా, వీడు మనవాడే, ఒసేయ్ రాములమ్మ ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాలు. కొన్నాళ్ళపాటు తెలుగు తెరపై ఎన్నో సినిమాలో విలన్ పాత్రలు చేసిన రామిరెడ్డి ఎలా చనిపోయారో తెలిస్తే దుఖం పొంగుకొస్తుంది.
కాలేయ సంబంధ వ్యాధి కారణంగా 55 ఏళ్ల వయస్సుకే 2011లో రామిరెడ్డి కన్నుమూశారు. వ్యాధి బారిన పడినప్పటి నుంచి రామిరెడ్డి నరకం అనుభవించారు. గుర్తుపట్టేలేనంత సన్నగా అయిపోయారు. చాలాకాలం పాటు ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కుని 2011, ఏప్రిల్ 14న కన్నుమూశారు.
రామిరెడ్డి చిత్తూరు జిల్లా వాయల్పాడు సమీపంలోని ఓబుళంవారిపల్లెలో జన్మించాడు. ఆయన విద్యాబ్యాసం హైదరాబాదులోనే సాగింది. ఓయూ నుంచి జర్నలిజంలో పట్టా పొందిన రామిరెడ్డి నటుడు కాక మునుపు ఓ ఉర్దూ పత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేశాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.