టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఎదో ఒక వివాదంతో వార్తల్లో నానుతూనే ఉంటారాయన. సినీ విషయాలపైనే కాకుండా రాజకీయ అంశాలపై కూడా స్పందిస్తుంటారు. కుదురుగా అసలే ఉండరు. అందుకే ఆయన్ను వివాదాస్పద దర్శకుడుగా పిలుస్తుంటారు.
ఇక ఈ విషయం పక్కన పెడితే రాంగోపాల్ వర్మకి ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ అందరిలో ఎక్కువగా శ్రీదేవి అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆమెతో కలిసి గోవిందా గోవిందా, క్షణక్షణం వంటి సినిమాలను తెరకేక్కించారు. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
ఈ సినిమాలు రూపొందించే సమయంలోనే శ్రీదేవి- రామ్ గోపాల్ వర్మ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యంతోనే ప్రతి విషయాన్ని ఆర్జీవీతో శ్రీదేవి షేర్ చేసుకునేదట. వ్యక్తిగత విషయాలను కూడా పంచుకునేదట. ఈ క్రమంలోనే శ్రీదేవిని పెళ్లి కూడా చేసుకోవాలని ఆర్జీవీ అనుకున్నారట. అయితే, ఆ సమయంలోనే తాను బోని కపూర్ ను పెళ్లి చేసుకుంటున్నట్లు శ్రీదేవి చెప్పడంతో తన ప్రేమ విషయాన్ని ఆర్జీవీ తన లోపలే ఉంచుకున్నారట.
ఆర్జీవి అంటే శ్రీదేవికి కూడా ఇష్టం ఉన్నప్పటికీ ఆర్జీవికి ఓ హీరోయిన్ తో ఉన్న ఎఫైర్ వల్లే ఆమె బోనికపూర్ తో పెళ్లికి రెడీ అయిందట. ఆర్జీవీ ఎఫైర్ నడిపిన హీరోయిన్ ఎవరో కాదు ఊర్మిళా మండోత్కర్. ఈమెతో కలిసి ఆర్జీవి రంగీలా అనే సినిమా చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ఆర్జీవి ఆమెతో కలిసి చాలా రోజులు డేటింగ్ చేశారని అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. ఇక ఈ విషయం శ్రీదేవికి కూడా తెలిసి ఆర్జీవి మీద ఉన్న ఇష్టం పోయిందని, అందుకే శ్రీదేవి రాంగోపాల్ వర్మల పెళ్లి జరగలేదని అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి.
Also Read : ముద్దు సీన్స్ పై రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్