తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పెద్ద పండగ. సంక్రాంతి ఆంధ్రాకు మాత్రమే పెద్ద పండగ…తెలంగాణకు కాదని పండగను కూడా విభజన రాజకీయాలను వాడుకున్నారు. పండగ అంటే చిన్నదా..? పెద్దదా అనేది కాదు. పండగ అంటే వేడుక. కుల, మతాలను మరిచి దుఖాలను మరిచిపోయి హాయిగా గడిపే రోజు. సంవత్సరంలో ఓ రోజు ప్రత్యేకంగా జరుపుకునే వేడుకకు చిన్నది..పెద్దది అని పేర్లు పెట్టడం భావదారిద్ర్యమే.
సంక్రాంతి పండగ ఎందుకు ఎప్పుడు చేసుకుంటారు..? పంటలు చేతికి వస్తోన్న సమయంలో రైతులు ఆనందంగా జరుపుకునే పండగ ఇది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబానికి భూమితో అనుబంధం ఉంటుంది. అందుకే ఇది కులానికో, మతానికో పరిమితమైన పండగ కానే కాదు. అందరి పండగ. ఇకపోతే ఈ సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో జూదమే ఎక్కువ కనిపిస్తోంది. సంక్రాంతి అంటే జూదమే అన్నట్లు మార్చేస్తున్నారు కొందరు.
సంక్రాంతి అంటే పండగ వాతావరణం రానురాను కనిపించడం లేదు. ఈ పండగ అంటే జూదమే అన్నట్లు మారిపోయింది. కోడి పందెలు నిర్వహించడం ఈ పండగ ఆనవాయితీ అన్నట్లుగా తయారైంది. ఇలాంటి వాతావరణాన్ని రూపుమాపాల్సిన అవసరముంది. లేదంటే పండగలు కూడా గతంలో జరుపుకునేవిగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది.
పాలిట్రిక్స్ పాఠకులకు హ్యాపీ సంక్రాంతి