సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత తమిళ చిత్ర పరిశ్రమలో అంతటి క్రేజ్ దక్కించుకున్న హీరో విజయ్. వరుసగా సక్సెస్ లు ఆయన ఖాతాలో పడటంతో స్టార్ డం సంపాదించుకున్నారు. ప్లాప్ టాక్ లు వచ్చిన తనకున్న స్టార్ డంతో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ తో ఆయన సినిమాలు దుమ్మురేపుతున్నాయి.
హీరో విజయ్ , హీరోయిన్ రష్మిక మందన కాంబోలో తెరకెక్కిన ‘వారసుడు’ సంక్రాంతి కానుకగా శనివారం రిలీజ్ అయింది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత కాగా..వంశీ పైడిపల్లి డైరెక్టర్ కావడం విశేషం. పాటలు మరియు ట్రైలర్ తో విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూలో చూసేద్దాం.
కథ : రాజేంద్రన్ (శరత్ కుమార్) అనే బిజినెస్ మెన్. తాను చేసే వ్యాపార రంగంలో విజయాలను మాత్రమే ఇష్టపడే వ్యక్తి. అపజయాలను అస్సలు సహించరు. ఆయన చేసే బిజినెస్ లో ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. అతనికున్న ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు ఆయన కంపెనీలోనే పనిచేస్తుంటారు. కాని మూడో కుమారుడు విజయ్ మాత్రం తనకు నచ్చినట్టుగా బతకాలని అనుకుంటాడు. కాని పరిస్థితులు అనుకూలించక ఇంటికి చేరుతాడు. అప్పుడు తన తండ్రి బిజినెస్ సమస్యలో ఉండటాన్ని గమనిస్తాడు. ఆ సమస్యల నుంచి తండ్రిని ఎలా బయటకు తీసుకొస్తాడు..? ఆ కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు అనేది ఈ సినిమా స్టొరీ.
విశ్లేషణ : ఎమోషన్స్ ను బేస్ చేసుకొని డైరక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాను తెరకెక్కించారు. స్టొరీ పాతదే అనిపించినప్పటికీ ఎమోషన్స్ ను క్యారీ చేసి సినిమాను బోర్ కొట్టకుండా కేర్ తీసుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీ అంత సినిమా చూడాలనుకుంటే ఈ మూవీ రైట్ ఛాయిస్. ముందు చెప్పుకున్నట్లుగా కథ పాతదే.. ఈ సినిమా చూస్తుంటే.. వంశీ పైడిపల్లి పాత సినిమాలు గుర్తుకొస్తాయి. కాని ఎక్కడ కూడా అనవసరంగా పండగపూట ఈ సినిమాకు వచ్చామే అనే ఫీల్ మాత్రం కలగదు.
ఈ సినిమాకు ప్లస్ పాయింట్ విజయ్. ఈ మూవీలో విజయ్ కామెడి, ఎమోషన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. అతను ఎమోషన్స్ పండిస్తుంటే ఫ్యాన్స్ కళ్ళలో తప్పకుండా నీళ్ళు తిరగుతాయి. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. పాటలు కూడా సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్ళాయి.’రంజితమే’,’వా తలపతి’ సాంగ్స్ ఆన్ స్క్రీన్ మీద అదిరిపోయాయి. విజయ్ జంటగా నటించిన రష్మిక కూడా పర్వాలేదనిపించింది. శ్రీకాంత్ , యోగిబాబు మరియు శరత్ కుమార్ వంటి నటులు పెర్ఫార్మన్స్ బాగానిపిస్తుంది.
చివరి మాట : సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలనుకునే వారికీ ఈ మూవీ రైట్ ఛాయిస్.
రేటింగ్ : 2.5/5