వైఎస్సార్ తెలంగాణ పార్టీకి బీజేపీ అండగా ఉంటుందని ఇటీవల తరుణ్ చుగ్ అన్నట్టు జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్ షర్మిల ఎవరో వదిలిన బాణం కాదు. ఆమె బీజేపీ బీజేపీ వదిలిన బాణమంటూ విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో తెలంగాణలో టీడీపీతో పొత్తు అంశాన్ని బీజేపీ సీరియస్ గా ఆలోచిస్తుందని తరుణ్ చుగ్ అన్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటన్నింటిపై తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని తరుణ్‌చుగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీకి అండగా నిలబడాలని తన అన్నట్టు జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. బీఆర్ఎస్ ను గద్దె దించే శక్తి బీజేపీకే ఉందని.. అలాంటప్పుడు మరో పార్టీతో పొత్తు ఎందుకుంటుందని ప్రశ్నించారు.
ఇక, తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో అదే ఊపులో నిజామాబాద్ లో సభను నిర్వహించినున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో టీడీపీ బల ప్రదర్శన చేయడానికి కారణం.. బీజేపీతో పొత్తు కోసమేనని ఇతర పార్టీలు విమర్శించాయి.
తెలంగాణలో బీజేపీకి అండగా ఉంటామని.. ఏపీలో తమకు సహకరించాలనే ప్రతిపాదనలను బీజేపీ ముందు టీడీపీ ఉంచినట్లు ఇతర పార్టీల నేతలు చెప్పుకొచ్చారు. కాని టీడీపీ నేతలు మాత్రం ఇప్పటివరకు పొత్తుల అంశంపై మాట్లాడనేలేదు. తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తాజాగా కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. అంటే.. ప్రస్తుతానికి టీడీపీ మదిలో పొత్తు ఆలోచనే లేదని అర్థం అవుతోంది. బీజేపీ కూడా అదే చెప్తుంది.
Also Read : అంతర్గత సర్వేలో బీజేపీకి బిగ్ షాక్