మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమయ్యాడు. బీజాపూర్ – తెలంగాణ సరిహద్దులో చేపట్టిన ఆపరేషన్ లో మావోయిస్టులు, గ్రే హౌండ్స్ దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో హిడ్మాను హతం చేశారు.
బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్, CRPF కోబ్రా కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో హిడ్మా హతమయ్యాడు. 1996-97లలో 17 ఏళ్ల వయసులో హిడ్మా మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై మావోయిస్ట్ పార్టీలో చేరారు. ఆ తరువాత పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన హిడ్మా కేంద్ర కమిటీలో కీలక సభ్యుడుగా మారాడు. ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో మావోయిస్టు కీలక వ్యూహకర్తగా ఉన్నాడు.
దక్షిణ బస్తర్ జిల్లా సుక్మా జిల్లాలోని పువర్తి హిడ్మా స్వగ్రామం. మావోయిస్ట్ పార్టీలో చేరకముందు వ్యవసాయం చేస్తుండేవాడు. చదివింది ఏడో తరగతే అయినా ఓ లెక్చరర్ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఆయుధాల తయారీ, రిపైర్ వర్క్‌లో ప్రావీణ్యం ఉంది. 2001-02 ప్రాంతాల్లో దక్షిణ బస్తర్ జిల్లా ప్లటూన్‌లో ఎదిగిన హిడ్మా..సల్వాజుడుం ఎదుగదలే హిడ్మా మరింత యాక్టివ్ కావడానికి కారణమైంది. 2007లో ఉర్పల్ మెట్ట వద్ద సీఆర్పీఎఫ్పై జరిగిన దాడిలో హిడ్మాకీలక పాత్ర పోషించారు. ఎన్నో ఎన్ కౌంటర్ల నుంచి తప్పించుకున్నాడు. ప్రణాళికలు రచించి అమలు చేయడంలో దిట్టగా పేరొందిన హిడ్మా పోలిసుల హిట్ లిస్టు లో మోస్ట్ వాంటెడ్ గానున్నాడు.