భారత్ జోడో యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా కొనసాగుతోంది. దేశ ఐక్యతే ధ్యేయమని చాటుతూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.
ఇటీవల బీజేపీ చేపట్టిన ర్యాలీలకు మాత్రం జనం ఆదరణ అంతగా లభించలేదు. రాహుల్ యాత్రకు మాత్రం జననీరాజనం పలుకుతున్నారు. దీనిని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం హైలెట్ చేసింది. ఇంకేముంది బీజేపీకి ఎక్కడో మండింది.
రాహుల్ గాంధీని అవమానించేందుకు గతంలో ఏవేవో ప్రయత్నాలు చేసిన బీజేపీ సోషల్ మీడియా వింగ్ మరోసారి అలాగే విఫలయత్నం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల రాహుల్‌గాంధీ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్న ఫోటోను మార్ఫింగ్ చేసి తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది.
రాహుల్‌గాంధీ అల్పాహారం ముందున్న టీ గ్లాసుకు బదులుగా మందు గ్లాస్ పెట్టడం, డ్రై ఫ్రూట్స్ స్థానంలో మాంసాహారం ప్లేట్‌ని మార్చి ఆ ఫోటోను సోషల్ మీడియాలో బీజేపీ సోషల్ మీడియా విభాగం పోస్ట్ చేసేసింది. తరువాత ఆ ఫోటోను సామజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
ఈ మార్ఫింగ్ ఫోటో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడంతో తమ నాయకుడు అల్పాహారం తీసుకుంటున్న ఒరిజనల్ ఫోటోను జత చేసి తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ రెండు ఫోటోలను పోల్చుతూ బీజేపీనే తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించింది.
ఈ ప్రపంచంలో ప్రతివిషయాన్నీ
జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి!ఙ్ఞానం లేకపోవడం కన్నా
తప్పుడు ఙ్ఞానం అత్యంత ప్రమాదకరం!! ఆ తప్పుడు ప్రచారం చేసేవాళ్ల వల్ల దేశానికి మరీ ప్రమాదం!@BJP4India @RSSorg డీఎన్ఏ అబద్ధాలు, నయవంచన, మోసం! #BoyCottBJP బీజేపీ అబద్ధాల ఫ్యాక్ట్రీ! pic.twitter.com/uYXdPb2xGl— Telangana Congress (@INCTelangana) January 10, 2023
ఈ ప్రపంచంలో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించాలని..జ్ఞానం లేకపోవడం కంటే తప్పుడు అజ్ఞానం అత్యంత ప్రమాదకరమైందని ఆ తప్పుడు జ్ఞానంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీని ఉద్దేశించి ట్వీట్ పోస్ట్ చేసింది. అలాంటి వాళ్ల వల్ల దేశానికి మరింత ప్రమాదమని బీజేపీ అబద్దాల ఫ్యాక్టరీని బైకాట్ చేయాలని ట్విట్టర్ లో డిమాండ్ చేసింది.