కువైట్ ఎయిర్ వేస్ లో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న యువతుల పట్ల రిక్రూమెంట్ ఏజెన్సీ సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదాస్పదం అవుతోంది. ఉద్యోగాలకు పిలిచి నగ్నంగా ఇంటర్వ్యూలు చేయించారని ఓ యువతి చెప్పడంతో సంస్థపై తీవ్ర విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి.
కువైట్ ఎయిర్ వేస్ లో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాల కోసం స్పెయిన్ లో గత ఏడాది నవంబర్ లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎయిర్ వేస్ తరఫున ఓ రిక్రూమెంట్ ఏజెన్సీ ఈ ఇంటర్వ్యూను నిర్వహించింది. ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహిస్తామని చెప్పిన రిక్రూమెంట్ ఏజెన్సీ సిబ్బంది యువతులను ఒక్కరోక్కరిగా లోనికి పిలిచారు. ఇంటర్వ్యూ చేసే గదిలోకి వెళ్ళాక యువతుల బట్టలు విప్పించినట్లు ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది.
యువతుల శరీరంపై టాటూలు ఇతర మచ్చలు ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు బట్టలు విప్పించారని దరఖాస్తు చేసుకున్న యువతి తెలిపింది. ఒంటిపై కేవలం లోదుస్తులతో నిల్బోబెట్టారని చెప్పుకొచ్చింది. పైగా.. తమ పట్ల వెకిలిగా ప్రవర్తించారని బాధపడింది.
ఇంటర్వ్యూ చేసిన వారు పలు అభ్యంతర వ్యాఖ్యలు కూడా చేశారని వాపోయింది. తమ నవ్వు బాగాలేదని, శరీరాకృతి సరిగ్గా లేదని దారుణంగా వ్యవహరించారని వెల్లడించింది. దీంతో కువైట్ ఎయిర్వేస్ పై నెటిజెన్లు భారీ ఎత్తున విమర్శలు చేయగా..ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్లు కువైట్ ఎయిర్ వేస్ వెల్లడించింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
Also Read : ముసలోళ్లతో శృతి హసన్ సరసాలా..!