టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఆ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. ఇందుకోసం కాలేజ్ లకు, ఆఫీసులకు డుమ్మా కొట్టేసి ఆ షో చూడడానికి వెళ్తుంటారు. ఆఫీసు మేనేజ్ మెంట్ ఆ రోజు సెలవు మంజూరు చేయకపోతే ఆ ఉద్యోగానికి రీజైన్ కూడా చేస్తారు. అలాంటి వారిలో బిగ్ బాస్ తో ఫేమస్ అయిన అషూ రెడ్డి కూడా ఒకరు.
ఇంతకీ అషూ రెడ్డి తన జాబ్ ఎలా పోగొట్టుకుందో తెలుసుకుందాం. అషూ రెడ్డి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్నది తెలిసిందే. పవన్ కళ్యాణ్ మీద ఉన్న పిచ్చి అభిమానంతో తన జాబ్ ని కూడా మానుకుందట. అషూ రెడ్డి అప్పట్లో యుఎస్ లోని డల్లాస్ లో ఒక కంపెనీలో జాబ్ చేసేది. అయితే అదే టైంలో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా చూడడానికి సెలవు కావాలని తన మేనేజర్ కి మెయిల్ పెట్టింది. అయితే ఆ మెయిల్ ఎలా పెట్టిందంటే.. సార్ నేను మంగళవారం ఆఫీస్ కి రావచ్చు.. రాకపోవచ్చు ఎందుకంటే ఆరోజు నా అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది.
నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే నాకు సిగ్గుచేటు. అయితే నాకు పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. అయితే మీరు నాకు సెలవు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఖచ్చితంగా సినిమాకి వెళ్తాను. ఒకవేళ నా ఉద్యోగం ఉంటే పర్లేదు కానీ నా ఉద్యోగం వేరే వారికి ఇచ్చినా కూడా నేను ఏమీ అనుకోను. కానీ మీరు పనిలో నైపుణ్యం ఉన్న నాలాంటి మంచి ఉద్యోగిని కోల్పోతారని నేను అనుకోవడం లేదు.ఇక అది మీ ఇష్టం అంటూ అషూ రెడ్డి మెయిల్లో రాసిందట. అంతేకాదు ఆ మెయిల్ కి మూవీ ఫీవర్ అనే సబ్జెక్టు కూడా పెట్టింది.
కానీ ఈ మెయిల్ చూసిన మేనేజర్ ఆమెను జాబ్ నుండి తీసేశారు. కానీ అషూ రెడ్డి మాత్రం తనని జాబ్ నుండి తీసేసినందుకు ఏమాత్రం ఇబ్బంది పడలేదు. ప్రస్తుతం అషూ రెడ్డి కి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది అభిమానం ఉండొచ్చు కానీ, మరి ఇంత పిచ్చి ఉండకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమందేమో పవన్ కళ్యాణ్ కోసం నీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : అషూ , ఆర్జీవీల బోల్డ్ ఇంటర్వ్యూ – సె* 10నిమిషాల్లో చేసేస్తారంటూ..!