టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన మధ్య ఎఫైర్ నడుస్తోందని కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తమ మధ్య అలాంటిదేమీ లేదని వీరిద్దరూ ఖండిస్తున్నా.. నిజం ఎప్పుడో ఓరోజు బయటపడుతుంది కదా. ఆరోజు రానే వచ్చింది. తాజాగా బయటకొచ్చిన వీడియోతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని స్పష్టమైంది.
న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకునేందుకు విజయ్ దేవరకొండ మాల్దీవ్స్ వెళ్ళారు. రష్మిక కూడా అక్కడికే వెళ్ళారు. ఇది యాదృచ్చికంగా జరిగిందో లేక ప్లాన్ చేసుకొని వెళ్ళారో కాని, వారి సోషల్ మీడియా వీడియోతో వీరి ప్రేమాయణం బయటపడింది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి ఓకే డెస్టినేషన్ ఎంచుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక కలిసే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు వీడియో బయటకు రావడంతో ఆధారాలతో సహా నిరూపణ అయింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక తన ఫ్యాన్స్ తో ఆన్ లైన్ చాట్ లో పాల్గొన్నారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తూ కనిపించారు. ఉన్నట్టుండి ఆ లైవ్ వీడియోలో విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది. వీడియోలో ఎక్కడ కూడా విజయ్ కనిపించికపోయిన రష్మిక ఉన్న చోటే విజయ్ ఉన్నాడని తెలిసిపోయింది. విజయ్ వాయిస్ ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఆయన వాయిస్ ను ఈజీగా గుర్తుపట్టొచ్చు. రష్మిక ఆన్ లైన్ చాట్ లో ఉండగా ఎవరితోనో విజయ్ ఫోన్లో లేదా నేరుగా మాట్లాడుతున్నట్టు ఆ వాయిస్ ఉంది. అంటే ఆమె ఉన్న గదిలోనే విజయ్ ఉన్నట్టు తేలిపోయింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. బాలీవుడ్ మీడియా ఈ వార్తకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. విజయ్ దేవరకొండ- రష్మిక మందనలు డేటింగ్ లో ఉన్నారని చెప్పేందుకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి తిరిగిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
విజయ్-రష్మిక గీత గోవిందం సినిమాలో కలిసి నటించారు. అపుడు వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసిందని కొన్నాళ్ళుగా వార్తలు వెలువడ్డాయి. తాజాగా వీడియో బయటకు రావడంతో ఇప్పుడు అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.
VD voice in the background😅😅#VIROSH #VijayDeverakonda #RashmikaMandanna
may be friends or may be something else 😜😜 pic.twitter.com/vYAraniND0— Bharath (@Bharath__b) January 2, 2023
Also Read : అమ్మనవుతా – రష్మిక ఎమోషనల్