ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో లోక్ సభ ఎన్నికలపై బీజేపీ అప్పుడే ఫోకస్ పెట్టింది. పలు రాష్ట్రాల్లో పార్టీ బలబలాలపై అంతర్గత సర్వే నిర్వహించగా షాకింగ్ రిజల్ట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చినా ఈసారి మాత్రం అధికారం కోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి ఉంటుందని తేలింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురు కానుందని సర్వేలో తేలినట్లు సమాచారం.
Also Read : ఆ విషయంలో రేవంత్ పోరాడుతున్నారు – బండి సంజయ్ మౌనమేలా.?
కేంద్రానికి మరో ఏడాదిన్నర పదవి కాలం మిగిలి ఉంది. రాజకీయ పరిస్థితులు కొంత సంక్లిష్టంగా మారడంతో కమలం కాంపౌండ్ లో ఆందోళన కనిపిస్తోంది. ఇటీవల వెల్లడైన హిమాచల్ ప్రదేశ్ ఫలితంతో బీజేపీ అలర్ట్ అయింది. అక్కడ అధికారం కోల్పోవడంతో భారత్ జోడో యాత్ర ప్రభావం దేశమంతా ఉందని గ్రహించింది. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు ఈశాన్యా రాష్ట్రాలతోపాటు రాజస్తాన్, హర్యాణా, చతీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటితేనే లోక్ సభ ఎన్నికల నాటికీ ప్రభావం చూపుతామని బీజేపీ భావిస్తోంది. లేదంటే.. బీజేపీ ప్రభంజనం గాలి బుడగలా తేలిపోతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే లోక్‌సభ ఎన్నికలపై అంతర్గత సర్వే నిర్వహించింది.
Also Read : బీజేపీకి బీఆర్ఎస్ భయపడుతుందా..?
దేశ ఐక్యత, పార్టీ బలోపేతం కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రకు పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపుతున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులు, పార్టీలు ఈ భారత్ జోడో యాత్రకు సంఘీభావం తెలియజేస్తున్నారు. బీజేపీ హయంలో దేశం ఎన్నడు లేని విధంగా దేశం వెనక్కి పోయిందని.. మళ్ళీ మంచి రోజులు రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందని భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ వివరించారు. కాంగ్రెస్ ఏం చేసిందో..? బీజేపీ ఎలాంటి విధ్వంసం చేసిందో క్షుణ్ణంగా ప్రజలకు వివరించారు. దీంతో దేశపౌరుల్లో ఆలోచన మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ చేసిన అంతర్గత సర్వేలో షాకింగ్ ఫలితం వెల్లడి అయినట్లు సమాచారం. భారత్ జోడో యాత్ర ప్రభావం ఉన్నట్లు సర్వేలో తేలింది. అందుకే రాహుల్ యాత్రను కరోనా సాకుతో ఆపేయాలని కేంద్రం కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.
Also Read : రేవంత్ లాజిక్ తో కేసీఆర్ పరేషాన్..!
లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీతో కలిసి పని చేసేందుకు ప్రాంతీయ పార్టీలు కూడా సంసిద్దత వ్యక్తం చేయడంలేదు. ఈసారి బీజేపీకి విజయం అంత సులువుగా దక్కదని.. కాంగ్రెస్ పుంజుకోవడం ఖాయమనే భావనలో ప్రాంతీయ పార్టీలు ఉన్నట్లు బీజేపీ ఇంటర్నల్ సర్వేలో తేలింది. కాంగ్రెస్‌తో ఇప్పటికే శరద్‌పవార్, స్టాలిన్ వంటి నేతలు మైత్రి కొనసాగిస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేస్తే ఈ పార్టీలకు ఉభయతారకంగా ఉంటుందని తేలింది.
బీజేపీ అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడం కష్టమేనని..ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ అంతర్గత సర్వేలో తేలినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.
Also Read : టి. బీజేపీలో సీఎం చైర్ కొట్లాట – డీకే అరుణ వర్సెస్ ఈటల