ఇండియాలో క్రేజీ టాక్ షో గా మారింది ‘అన్ స్టాపబుల్ విత్ NBK’. ఆహలో ప్రసారం అవుతోన్న ఈ షో కు రోజులు గడిచే కొద్ది ఆదరణ మరింత పెరుగుతోంది. ఈ షో ను ప్రసారం చేస్తోన్న ఆహ మీడియా ‘అన్ స్టాపబుల్ విత్ NBK’పుణ్యమా అని ఇండియాలో టాప్ 10 ఓటీటీ యాప్స్ లో ఒకటిగా చోటు దక్కించుకుంది. వరుసపెట్టి సెలబ్రిటీలను బాలయ్య ఇంటర్వ్యూ చేస్తుండటంతో ఆహ కు ఆడియన్స్ పోటెత్తుతున్నారు.
ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్ ను ఆహ మీడియా అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కు ఆడియన్స్ తాకిడి ఎక్కువవ్వడంతో దెబ్బకు యాప్ క్రాష్ అయింది. సర్వర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆహ టీం ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసింది. అయినా ప్రభాస్ మొదటి ఎపిసోడ్ కొత్త రికార్డ్ లను క్రియేట్ చేసింది.
ఇప్పటివరకు ఆ ఎపిసోడ్ కు దాదాపుగా కోటి వ్యూస్ వచ్చాయట. వారం రోజులు కూడా గడవనేలేదు కోటికి పైగా వ్యూస్ తో ప్రభాస్ ఎపిసోడ్ దుమ్ము రేపింది. ఇక త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కానుంది.
ప్రభాస్ ఎపిసోడ్ కు వారం రోజుల్లో వచ్చిన కోటి వ్యూస్ రికార్డ్ ను పవర్ స్టార్ బ్రేక్ చేసి కొత్త రికార్డ్ నెలకొల్పుతారా..? అనేది చూడాలి. పవర్ స్టార్ కు సంబధించిన ఎపిసోడ్ ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తారాని తెలుస్తోంది.
Also Read : సరికొత్త రికార్డ్ నెలకొల్పిన ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్