పెళ్ళైన పది రోజులకే ఓ నవ వధువు మరో యువకుడిని పెళ్లి చేసుకొని ఆపై షాక్ ల మీద షాక్ లు ఇచ్చింది. పోలిసుల విచారణలో సినిమా ట్విస్ట్ లను మించి ఈ లవ్ స్టొరీ బయటకు వచ్చింది.
పుదుమనైకి చెందిన పద్దినిమిదేళ్ళ యువతికి తన మేనమామతో వివాహం జరిపించారు. పెళ్లి అయిన పదిరోజుల తరువాత ఆమె ఇదివరకు ఉద్యోగం చేసే జ్యూస్ దుకాణానికి వెళ్ళిపోయింది. రోజు ఉదయం వెళ్లి రాత్రి 7గంటలకు వచ్చే యువతి ఆరోజు రాకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అదృశ్యమైన యువతి తరుచుగా గోకుల్(26) అనే వ్యక్తితో మాట్లాడేదని గుర్తించారు. అతడిది ఒడియటూరు అని నిర్ధారించుకున్నారు.
Also Read : అన్నాచెల్లెళ్ళు ప్రేమించుకున్నారు – ఇంట్లో విషయం తెలియడంతో..
గోకుల్ పల్లికొండ పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నట్లు పోలిసుల విచారణలో తేలింది. అయితే , అప్పటికే గోకుల్ కు పెళ్లి అయింది. రెండేళ్ళ కొడుకు ఉన్నాడు. అప్పటికీ అతని భార్య ఆరు నెలల గర్భిణీ కూడా. నవ వధువుతోపాటు గోకుల్ కూడా మాయం అయ్యాడని గుర్తించిన పోలీసులు విచారణను మరింత స్పీడప్ చేశారు. భార్యను లవ్ మ్యారేజ్ చేసుకున్న గోకుల్ కు రెండేళ్ళ కిందట జ్యూస్ దుకాణంలో పని చేస్తోన్న అమ్మాయి పరిచయం అయిందని పోలీసులకు తెలిసింది. ఆతరువాత గోకుల్ భార్య నుంచి వివరాలు సేకరించారు.
నవ వధువుతో ప్రేమ వ్యవహారం భార్యకు తెలియకుండా గోకుల్ జాగ్రత్త పడ్డాడు. తనకు పెళ్లి అయిన విషయాన్ని కూడా చెప్పకుండా, పెళ్లి చేసుకుంటానని ప్రియురాలికి చెప్పాడు. పెట్రోల్ బంక్ పక్కనే జ్యూస్ షాప్ ఉండటంతో వీరిద్దరూ తరుచు కలుసుకునేవారు.
Also Read : అవకాశాలు రావాలంటే అర్పించాల్సిందే – హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ప్రియుడితో కలిసి వెళ్ళిపోయే ముందు గోకుల్ కు పెళ్లైందని యువతికి తెలిసింది. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో ప్రియురాలికి ఆమె మేనమామతో వివాహం జరిగిందని గోకుల్ గొడవ పడ్డాడు. ఆ తరువాత ఇద్దరు కలిసి అక్కడి నుంచి చెక్కేశారు. యువతి గోకుల్ ను టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. గుడిలో తనకు తాళి కట్టాలని చెప్పింది. నా భార్యతో విడాకులు తీసుకోకుండా తాళి ఎలా కట్టాలని ప్రియురాలిని ప్రశ్నించాడు. నా మెడలో తాళి కట్టకపోతే సూసైడ్ లెటర్ రాసి చస్తానని…అందులో నా చావుకి నువ్వే కారణం నువ్వేనని రాస్తానని గోకుల్ ను బెదిరించింది.
ప్రియురాలి బెదిరింపులు భరించలేక గోకుల్ 25వ తేదీన గుడియాతంలోని ఓ ఆలయంలో కొత్త పెళ్లికూతురు మెడలో తాళి కట్టాడు. ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కాపురం ప్రారంభించారు. యువతి మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా యువతి ఉన్న ఇంటికి వెళ్ళారు పోలీసులు. తాళివిప్పి తల్లిదండ్రులతో వెళ్ళిపోవాలని సూచించారు. అందుకు కొత్త ఆమె నిరాకరించింది. పైగా, నేను గర్భవతినని చెప్పడంతో షాక్ అయ్యారు.
Also Read : ఓ హీరో నన్ను వాడుకొని వదిలేశాడు -హీరోయిన్ అంజలి కామెంట్స్
విషయం తెలుసుకున్న గోకుల్ భార్య ఆమె బిడ్డను తీసుకొని యువతి పాదాల వద్ద ఉంచి తన భర్తను తనకు అప్పగించాలని కోరింది. ఇప్పుడు తాను ఆరు నెలల గర్భవతినని చెప్పింది. అందుకు యువతి బదులిస్తూ.. తాను కూడా గర్భవతినేనని చెప్పింది. పోలీసులు కొత్త పెళ్లికూతురికి వైద్యపరీక్షలు చేయించారు. అయితే ఆమె గర్భవతి కాదని తేలింది. పోలీసులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పి కొత్త పెళ్లికూతురిని ఇంటికి తీసుకెళ్లారు. అయితే పెళ్లి జరిగిన 10 రోజులకే వేరేవాడితో లేచిపోయిన నా భార్యతో నేను కాపురం చెయ్యలేను అని ఆమె మేనమామ తేల్చి చెప్పడంతో ఈ కథ మరో మలుపు తీసుకుంది.
Also Read : పెళ్ళైన ఆరు నెలలకే ప్రెగ్నెన్సీ ప్రకటించిన పూర్ణ..!