డీజీపీ మహేందర్ రెడ్డి పదవి విరమణ పొందటంతో ఇంచార్జ్ డీజీపీగా అంజనీ కుమార్ ను నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనతోపాటు మరో ఐదు స్థానాల్లో ఐపీఎస్ లను బదిలీ చేశారు. ఈ ఆరు చాలా పవర్ ఫుల్ పోస్టులు. పోలీసు డిపార్ట్ మెంట్ మొత్తం ఈ ఐదు పోస్టుల మీదుగానే నడుస్తుంది. అయితే, ఈ ఆరు పోస్టుల్లో నియామకం అయిన వారు తెలంగాణ క్యాడర్ కు చెందిన వారే కాని తెలంగాణ స్థానికత ఉన్నవారు కాదు. ఇప్పుడు ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి లేవనెత్తుతున్నారు.
ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కీలక పోస్టుల్లో స్థానికేతరులు నియామకం అవుతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. ఒక్క కీలక పోస్టులోనైనా తెలంగాణకు చెందిన వారికీ బాధ్యతలు అప్పగించకుండా తెలంగాణ అధికారులను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఐపీఎస్ లలో సమర్ధులైన తెలంగాణవారు లేరా..? వారినెందుకు కీలక శాఖల్లో నియమించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వంలోని కీలక శాఖలో బీహార్ వాళ్ళనే నియమిస్తున్నారని రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా డీజీపీగా నియామకమైన అంజనీ కుమార్ బీహారీ కావడంతో రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : రేవంత్ రెడ్డి కొత్త పార్టీ – బీఆర్ఎస్ భజన జర్నలిస్ట్ పోస్ట్ ఉద్దేశ్యపూర్వకమేనా..?
తెలంగాణ స్థానికత ఉన్న సివిల్ సర్వీసెస్ అధికారులు కేసీఆర్ ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నారు. స్వరాష్ట్రంలో కీలక పోస్టుల్లో తమను నియమించకుండా స్థానికేతరులైన బీహారీలను నియమిస్తున్నారని వారు ఆ మధ్య చర్చించినట్లు కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణ ఉన్నాతాదికారుల్లో సర్కార్ పై అసంతృప్తి ఉందని తెలిసాక కూడా ప్రభుత్వం తీరు మార్చుకోలేదు.మరోసారి బీహారిలకే డీజీపీగా అవకాశం కల్పించింది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సర్కార్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ స్థానికత ఉన్న అధికారులను కేసీఆర్ ఎందుకు నమ్మడం లేదని ప్రశ్నించి ఇదే అంశాన్ని ప్రజలు సీరియస్ గా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు రేవంత్.
ప్రభుత్వంలోని కీలక శాఖలో ఆంధ్రులను నియమిస్తే ఉద్యమ సమయంలో కేసీఆర్ మొదలుకొని టీఆర్ఎస్ కార్యకర్తల వరకు అందరూ వ్యతిరేకించిన వారే. తెలంగాణ అధికారులకు సీనియార్టి, అర్హత ఉన్నా ఎందుకు కీలక శాఖలో తెలంగాణ అధికారులని నియమించడం లేదని ప్రశ్నించిన కేసీఆర్ ఇప్పుడు సమైక్య పాలకుల తోవలోనే నడుస్తున్నాడు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులను కీలక శాఖలో ఆంధ్ర పాలకులు నియమించినట్లుగానే ఇప్పుడు కేసీఆర్ తన పూర్వీకుల మూలాలున్న బిహార్ స్థానికత కల్గిన అధికారులను తన ప్రభుత్వంలో కీలక శాఖలలో నియమించేస్తున్నారు. అందుకే కల్వకుంట్ల రాజ్యంలో మాయమైపోతున్న తెలంగాణం అంటూ రేవంత్ ట్వీట్ చేశాడు.
Also Read : అయ్యో పాపం కేసీఆర్ – ప్లాన్ రివర్స్ అయిందిగా..!
కేసీఆర్ తెలంగాణకు చేస్తోన్న అన్యాయాన్ని తెలంగాణ సమాజం ఎప్పుడు అర్థం చేసుకుంటుందో..? తిరగబాటుకు ఎప్పుడు సన్నద్ధం అవుతుందో చూడాలి.