దేశంలోనే అత్యధిక ధనవంతుడైన సీఎం, అత్యధిక కేసులున్న ముఖ్యమంమంత్రుల జాబితాలో తెలుగు రాష్ట్రాల సీఎంలే నెంబర్ వన్ గా ఉన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి అత్యంత ధనవంతుడైన సీఎం జాబితాలో మొదటి ప్లేసులో నిలిచారు. పాలిటిక్స్ లోకి రాకమునుపు సండూర్ పవర్ కంపెనీ ప్రారంభించి అప్పుల చేసిన జగన్ రాజకీయాల్లోకి వచ్చాక కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. సీఎంల గత ఎన్నికల అఫిడవిట్లను సేకరించి ఓ నేషనల్ మీడియా ఈ వివరాలను ప్రకటించింది.
ముఖ్యమంత్రుల్లో అత్యధిక ధనవంతుడిగా మొదటి స్థానంలో జగన్ నిలవగా.. చివరి స్థానంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. జగన్ ఆస్తులు రూ.370 కోట్ల కాగా.. మమతా బెనర్జీ ఆస్తి కేవలం 15లక్షలు మాత్రమే. బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఆస్తి రూ.56 లక్షలు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రూ.73 లక్షల ఆస్తులు కలిగి ఉన్నారు.
ఇక కేసుల విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగానున్న అందరి ముఖ్యమంత్రులతో చూస్తె తెలంగాణ సీఎం కేసీఆర్ పైనే ఎక్కువ కేసులున్నాయి. కేసీఆర్ పై 64కేసులు ఉండగా, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై 47 కేసులు , జగన్ పై 38కేసులు ఉన్నాయి. నేరారోపణలు కేసులు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులపైన ఉన్నాయి. అల్లర్లు, హత్యాయత్నం కేసులో కేసీఆర్ , చీటింగ్ కేసులో జగన్ , కిడ్నాప్ కేసులో తమిళనాడు సీఎం ఉన్నారు.
Also Read : తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు BRS & YCP పార్టీల ఆదాయం ఎంతో తెలుసా..?