తెలంగాణలో 90స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ఆ మధ్య ప్రకటించేశారు. అసలు తొంభై నియోజకవర్గాల్లో 30స్థానాల్లో ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరని తేలిపోయింది. పార్టీ వ్యవహారాలను చూసే బీఎల్ సంతోష్ హైదరాబాద్ కు వచ్చి ఈ విషయాన్ని వెల్లడించి టి. బీజేపీ నేతలకు కొత్తగా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పార్టీ మరింత బలపడాలని..ఇందుకోసం ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలకు గాలం వేయాలని సూచించారు.
Also Read : అయ్యో పాపం కేసీఆర్ – ప్లాన్ రివర్స్ అయిందిగా..!
తెలంగాణ బీజేపీకి 45నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత ఉన్నట్లు గుర్తించారు. ఆ నియోజకవర్గాలను బలమైన అభ్యర్థులతో ఫిల్ చేద్దామంటే నేతలెవరూ బీజేపీ కాంపౌండ్ లోకి రావడం లేదు. దీంతో ప్రత్యర్ధి పార్టీలోని అసంతృప్త సీనియర్ నేతలను బీజేపీలోకి తీసుకొచ్చే బాధ్యతను చేరికల కమిటీకి అప్పగించారు. బలమైన అభ్యర్థులైతే టికెట్ పై హామీ ఇచ్చి బీజేపీలోకి లాగేసుకోవాలని సూచించారు. ఈ విషయమై పార్టీ అగ్రనాయకత్వంతో కూడా హామీ ఇప్పిస్తామని చెప్పాలని వివరించారు.
Also Read : రేవంత్ ను ఫాలో అవుతోన్న బండి సంజయ్
తెలంగాణ కాంగ్రెస్ లో ఏర్పడిన ముసలాన్ని బీజేపీకి అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఆ పార్టీలోని సీనియర్లను బీజేపీలోకి ఆహ్వానించి హస్తం పార్టీని దెబ్బతీసి బీజేపీ రాష్ట్రంలో బలంగా ఉందనే సందేశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. అందుకే ఆయా నియోజకవర్గాల్లో పట్టున్న సీనియర్ నేతలకు టికెట్ పై హామీ ఇచ్చి బీజేపీలో చేర్చుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సూచించారు.
Also Read : ఆ సీనియర్లు గంపగుత్తగా బీజేపీలోకి వెళ్లనున్నారా..?
బీజేపీ విధించుకున్న టార్గెట్ 90స్థానాలు. ఈ మిషన్ సక్సెస్ కావాలంటే పార్టీలోకి వలసలు అవరమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. టికెట్ పై హామీ ఇస్తే ఒకరిద్దరు కాంగ్రెస్ సీనియర్లు గాంధీ భవన్ విడిచి నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో కాలు మోపేందుకు రెడీగా ఉన్నారు. అయినప్పటికీ బీజేపీకి ఇంకా అభ్యర్థులు కావాల్సి ఉంది. ఎన్నికల లోపు ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప బీజేపీకి బలమైన అభ్యర్థులు దొరికే ఛాన్స్ లేదు.