పదో తరగతి చదివి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే. తెలంగాణలో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణ డీలర్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. రాత పరీక్ష ద్వారా , ఇంటర్వ్యూల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే, ఇది ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని చౌక ధరల దుకాణాల డీలర్ల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ మాత్రమే. ఈ జిల్లాకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆదిలాబాద్ జిల్లాలోని రేషన్ డీలర్లు ఖాళీలున్న మండలాలు : ఆదిలాబాద్ (అర్బన్), ఆదిలాబాద్ (అర్బన్), బజార్ హత్నూర్, బేల, భీంపూర్, బోథ్, ఇచ్చోడ, జైనథ్, మావల, సిరికొండ, తాంసీ, గుడిహత్నూర్ ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా 1000లు అప్లికేషన్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్షను జనవరి 22వ తేదీన నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ అనవారి 27న ఉంటుంది. రాత పరీక్ష 80మార్కులకు, ఇంటర్వ్యూకు 20మార్కులకు కలిపి మొత్తం 100మార్కులకు కలిపి నియామక ప్రక్రియ ఉంటుంది.
ఆసక్తి, అర్హత కల్గిన అభ్యర్థులు జనవరి ఆరో తేదీవరకు దరఖాస్తును ఆదిలాబాద్ జిల్లాలోని డీఆర్ఓ కార్యాలయంలో అందజేయాలి. మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
Ration-Dealer-26122022 : నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి
Also Read : నిరుద్యోగులకు గుడ్ న్యూస్
Also Read : 8వ తరగతి విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం