పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఈమేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ పరీక్షల షెడ్యూల్ పై ప్రకటన చేశారు. ఈసారి వంద శాతం సిలబస్ తో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచే ఆరు పేపర్ల విధానం అమలు చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రతి పేపర్ కు మూడు గంటల సమయం ఉంటుందని వెల్లడించారు. ఒక్క సైన్స్ పేపర్ కు మాత్రం 3 గంటల 20నిమిషాల సమయం ఉంటుందని చెప్పారు.
ఫిబ్రవరి, మార్చిలో పదో తరగతి విద్యార్ధులకు ఫ్రీ ఫైనల్స్ ఉంటాయని మంత్రి చెప్పారు. వ్యాస రూప ప్రశ్నలకు ఇంటర్నల్ ఛాయిస్, సుక్ష్మ రూప ప్రశ్నలకు నో ఛాయిస్ విధానంతో ప్రశ్నా పత్రాలను స్టూడెంట్స్ కు అందుబాటులో ఉంచునున్నట్లు స్పష్టం చేశారు.