తెలంగాణలో కాంగ్రెస్ బలీయంగా మారుతోంది. ఆ పార్టీలోకి కొంతమంది అధికార పార్టీ నేతలు చేరేందుకు సిద్దమయ్యారని డిసెంబర్ మొదటి వారంలో విషయం కేసీఆర్ కు తెలిసింది. అసలు హస్తం పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేయాలని భావించిన కేసీఆర్ కు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడటం ఇష్టం లేదు. అందుకే ఆయన కాంగ్రెస్ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
అయినా, కాంగ్రెస్ చర్చలోకి వస్తోంది. బీఆర్ఎస్ అధికారానికి సవాల్ విసురుతోంది. ఎందుకిలా జరుగుతుందని చర్చించిన కేసీఆర్.. కాంగ్రెస్ దూకుడు వెనక ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఉండటం వలెనే సాధ్యం అవుతుందని నిర్ధారణకు వచ్చారు. వెంటనే పోలీసులను రంగంలోకి దింపితే ఇబ్బంది అవుతుందని గ్రహించి కొన్నాళ్ళు వేచి చూశారు.
రేవంత్ రెడ్డి పీసీసీ అద్యక్షుడు అయిన తరువాత ప్రతి విషయంలో సునీల్ కనుగోలు పాత్ర ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇన్ పుట్స్ ఇచ్చేది సునీల్ టీమే. ఎస్కే టీం ఇచ్చిన గైడ్ లైన్స్ వల్లే వరంగల్ డిక్లరేషన్ సక్సెస్ అయింది. దీనికంతంటికి కారణం ఎస్కే టీమేనని కేసీఆర్ కు అర్థమైంది.
ఇదే ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ గాలిలో కారు పల్టీలు కొట్టే అవకాశం ఉందని కేసీఆర్ ఆందోళన చెందారు. కాంగ్రెస్ లో ఎం జరుగుతుంది..? వరుసగా నిర్వహిస్తోన్న సభల విజయవంతం వెనక ఎవరున్నారు..? అని ఆరా తీశారు. విషయం తెలిసి కొన్నాల్లు వేచి చూసి సరిగ్గా సమయం చూసుకొని ఎస్కే ఆఫీసుపైకి పోలీసులను పరిగెత్తించారు.
సునీల్ కనుగోలు కూడా ప్రశాంత్ కిషోర్ దగ్గర పని చేసిన వ్యూహకర్తే. ఏపీ టీడీపీకి సేవలందిస్తోన్న రాబిన్ శర్మ కూడా పీకే శిష్యుడే. వీరికి పీకేతో తేడాలు రావడంతో సైడ్ అయ్యారు. వేర్వేరు పార్టీలకు సేవలందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలు సెట్ అయ్యాడు. ఈయనకు కాంగ్రెస్ నేత కొప్పుల రాజుతో మంచి ర్యాపో ఉంది. దాంతో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ వ్యూహకర్తగా పని చేయడం ప్రారంభించారు. దాంతో సునీల్ ఇన్ పుట్స్ ఆధారంగా రేవంత్ కార్యాచరణ తీసుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వెళ్తుండటం.. జనాల నుంచి ఆదరణ వస్తుండటంతో నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు కేసీఆర్. దీనికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని భావించి… సునీల్ ఆఫీస్ పై పోలీసులతో దాడి చేయించారు. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు సీజ్ చేయించారు. ఈ దాడులతో సునీల్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అయితే పోలీసులు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. సునీల్ కనుగోలును టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ దూకుడును నిలువరించవచ్చునని కేసీఆర్ ఆలోచన కావొచ్చు.
ఈ నెల 30న విచారణకు రావాలంటూ సునీల్ కనుగోలుకు నోటిసులు జారీ చేశారు. ఆయన అజ్ఞాతంలో ఉండటంతో ఎస్కే తరుఫున మల్లు రవి నోటిసులు అందుకున్నారు. మరి, శుక్రవారం జరిగే విచారణకు సునీల్ కనుగోలు హాజరు అవుతారా లేదా అన్నది చూడాలి.