నూతన సచివాలయ నిర్మాణం కోసం 650 కోట్లను కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం.. గ్రామ పంచాయితీ బాగోగుల కోసం మాత్రం నిధులు విడుదల చేసేందుకు ఇష్టపడటం లేదు. రెండేళ్లుగా గ్రామ పంచాయితీలకు నిధులు రిలీజ్ చేయకపోవడంతో సర్పంచ్ లు అప్పోసోప్పో చేసి పంచాయితీలను డెవలప్ చేశారు. పంచాయితీలకు ఇస్తామన్న పైసలనింకా విడుదల చేయకపోగా.. తాజాగా కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్ధిక సంఘం నిధులను పక్కదారి పట్టించి సర్పంచ్ ల నోట్లో మట్టి కొట్టేసింది. సర్పంచ్ ల డిజిటల్ సంతకాలను ఫోర్జరీ చేసి నిధులను డైవర్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
Also Read : కవిత అరెస్ట్ తథ్యం – మరి బీజేపీపై బీఆర్ఎస్ బాస్ ఏం చేయనున్నారు..?
పంచాయితీలో అభివృద్ధి పనులు చేయండి.. ఖజానా ఫుల్ లోడ్ తో ఉంది. మీకు నిధులు ఇస్తామని చెప్పడంతో సర్కార్ మాటలు నమ్మి అప్పులు చేసి గ్రామ పంచాయితీలను అభివృద్ధి చేశారు సర్పంచ్ లు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, మెక్కల పెంపకం , డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలకు నిర్ణీత గడువు విధించడంతో నిర్మాణాలను పూర్తి చేసేలా చేశారు. స్మశాన వాటికకు 18లక్షలు, డంపింగ్ యార్డుకు 2.5 లక్షలు , పల్లె ప్రకృతి వనానికి 5.7లక్షల చొప్పున మంజూరు చేసినట్లుగా ప్రభుత్వం జీవోలిచ్చింది.
Also Read : ప్రధానితో ముగిసిన భేటీ – తమ్ముడి బాటలోనే అన్నయ్య..?
రైతు వేదికలను కూడా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని 22 లక్షలు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. తీరా పనులైపోయాక చేసిన పనులకు బిల్లులు చెల్లించక సర్పంచ్ లను అదే పనిగా వేధిస్తోంది. ఒక్కో సర్పంచ్ కు సగటున 5లక్షల నుంచి 30లక్షల వరకు పెండింగ్ పైసలు రావాల్సి ఉంది. సర్కార్ ఇస్తామన్న బిల్లులు రాక చేసిన అప్పులకు మిత్తిలు పెరిగిపోయి 11మంది సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవేవి సర్కార్ మనస్సును కరిగించలేదు. సర్పంచ్ లే కదా ఆత్మహత్యలు చేసుకున్నది. చేసుకుంటే చేసుకొని అన్నట్లు వారి కుటుంబాలను ఆదుకున్నది లేదు.. పెండింగ్ నిధులు మంజూరు చేసింది లేదు.
Also Read : కేసీఆర్ కూతురికి కొత్త సంవత్సరంలో కష్టాలే..!
గ్రామ పంచాయితీలకు రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడింది అక్షరాల 35 వేల కోట్లు పైనే. కాని సర్కార్ మాత్రం అసలు పంచాయితీలకు బాకీ లేనట్లే వ్యవహరిస్తోంది. 15వ ఆర్ధిక సంఘం నిధులు కాగా, రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసింది. ఏకంగా సర్పంచ్ ల సంతకాలనే ఫోర్జరీ చేసి నిధులను పక్కదోవ పట్టిస్తే తెలంగాణ బీజేపీ నేతలు మీడియా ముంగిటకు వచ్చారు తప్పితే…కేంద్ర గ్రామీణాభివృద్ది, పంచాయితీ రాజ్ శాఖ నుంచి ఎవరూ నోరు మెదపకపోవడం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా కేంద్రం విడుదల చేసిన పంచాయితీ నిధులతో బీఆర్ఎస్ ను ఇర్కున పెట్టడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక వెసులుబాటు కల్పించాలనుకున్నట్లు కేంద్రం వైఖరి ఉన్నదన్న అభిప్రాయాలను రాజకీయ వర్గాలు వినిపిస్తున్నాయి. అంశం ఏదైనా కాని రాజకీయ ప్రయోజనాలే బీఆర్ఎస్ , బీజేపీల ఎజెండా. ఇప్పుడు పంచాయితీ నిధుల అంశంలోనూ అదే జరిగినట్లు ఉంది.
Also Read : గుజరాత్ మినహా మిగిలిన చోట్ల వాడిపోయిన కమలం
బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని చావుల తెలంగాణగా మార్చాడు కేసీఆర్.చేసిన పనులకు బిల్లులు రాక అప్పులు తీర్చలేక చావే శరణ్యమని సర్పంచ్ లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పుతెచ్చి అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు రాక, భార్య మెడలో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టినా, అప్పులు తీరక ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామసేవ చేద్దామనుకున్న పాపానికి దొర ప్రాణాలు తీస్తున్నాడు. ఆడబిడ్డలకు పుస్తెల తాడు ప్రాణ సమానం. ఊరికి ఉపకారం చేసినందుకు ఆ తాళినే అమ్మి వడ్డీలు కట్టాల్సిన దుస్థితిని కల్పించాడు కేసీఆర్. గ్రామీణ తెలంగాణ అభివృద్ధిని పరిహాసం చేస్తోన్న దొరను, అందుకు సహకరిస్తోన్న మోడీని తప్పక ఎండగట్టాల్సిందే.