సాధారణంగా అధికార పార్టీలకు పెద్దమొత్తంలో విరాళాలు అందుతాయి. కాని ఊహకు అందని విధంగా తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు విరాళాలు అందుతుండటం బిగ్ డిబేట్ గా మారింది. కేంద్రంలోని బీజేపీ తరువాత అత్యధిక విరాళాలు పొందుతోన్న పార్టీలు తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార బీఆర్ఎస్ , వైసీపీ పార్టీలే. ఎన్నికల కమిషన్ కు అధికారికంగా తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు అందించిన వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ , వైసీపీలు వందల కోట్లకు పడగలెత్తాయి.
Also Read : ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం – జగన్ మాస్టర్ ప్లాన్
తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ కు 2021-22 మధ్య కాలంలో రూ. 218.11కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.153 కోట్లు, ట్రస్టుల ద్వారా రూ.40 కోట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చారు. అయితే, అంతకుముందు ఈ మార్గాల్లో పైసా కూడా రాలేదు కాని ఈసారి మాత్రం కోట్లలో ఆదాయం వచ్చింది. పార్టీ ఆస్తుల విలువ ఏడాదిలో రూ. 288కోట్ల నుంచి రూ.480కోట్లకు చేరినట్లుగా చెప్పింది. ఆదాయం కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు రూ. 451 కోట్లుగా పేర్కొంది. ఇది కూడా సంవత్సరంలోనే 200కోట్లు పెరిగాయి. ఈ మొత్తం కలిపితే బీఆర్ఎస్ ఆస్తుల విలువ వెయ్యి కోట్లకు పైమాటే.
Also Read : చంద్రబాబు ద్విముఖ వ్యూహం – బీజేపీతో టీడీపీ పొత్తు..?
వైసీపీకి టీఆర్ఎస్ స్థాయిలో ఆస్తులు లేవు కావి.. వంద కోట్లకు కాస్త తక్కువ వచ్చాయి. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో రూ.93.72కోట్ల ఆదాయం వచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.60 కోట్లు, ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి రూ.20 కోట్లు వచ్చాయి. వైసీపీకి బ్యాంకుల్లో రూ.343 కోట్ల నగదు ఉంది. ఖర్చులుపోను రూ.92.72కోట్ల ఆదాయం మిగిలిందని ఈసీకి లెక్కలను సమర్పించింది. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీలకు బాగానే విరాళాలు అందుతున్నట్లు అర్థం అవుతోంది.
Also Read : టీఆర్ఎస్ కు బిగ్ షాక్ – టీడీపీలోకి కీలక నేతలు
బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎలక్టోరల్ బాండ్లు, ఎలక్టోరల్ ట్రస్టుల విధానం తేవడంతో ఇష్టారాజ్యంగా బ్లాక్ మనీని పార్టీలకు విరాళాలుగా తరలిస్తున్నట్టు అర్థం అవుతోంది.