ఆలు లేదు చూలు లేదు. అల్లుడి పేరు సోమ లింగం అన్నట్లుంది తెలంగాణ బీజేపీ నేతల తీరు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు కాని అప్పుడే సీఎం నేనంటే నేనేనని వరుస ప్రకటనలు చేస్తున్నారు. ఒకరు సీఎం రేసులో ఉన్నానని నేను ప్రకటించగానే మరో నేత కౌంటర్ గా తనకు కూడా ఆ అవకాశాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానాలు చేస్తూ పార్టీలో హీట్ పెంచేస్తున్నారు.
Also Read : సీరియస్ ఇష్యూ – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై వేటు..?
తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇందుకోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటోంది. ఇది బాగానే ఉన్నా…సీఎం పదవిపై అప్పుడే ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేయడం ఆ పార్టీ నేతలకే కాదు క్యాడర్ కు కూడా రుచించడం లేదు.
Also Read : బీజేపీని వదిలించుకోవాలని ఈటల భావిస్తున్నారా..?
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ , మాజీ మంత్రి ఈటల రాజేందర్ తదితరులు చేస్తోన్న ప్రకటనలు కాషాయ క్యాంప్ లో అలజడి రేపుతున్నాయి. గతంలో పదేళ్ళు మంత్రిగా పని చేసిన తనకు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని డీకే అరుణ చేసిన కామెంట్స్ తో కమలనాథులు ఉలిక్కిపడ్డారు. ఇంతలోనే మాజీ మంత్రి ఈటల కూడా ప్రజలు కోరుకుంటే సీఎం అవుతానని ప్రకటించడంతో బీజేపీలో అప్పుడే సీఎం చైర్ పై కొట్లాట మొదలైందన్న అభిప్రాయాలు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఓ సర్వేలో తెలంగాణ ప్రజలు ఈటలను సీఎం గా చూడాలని అనుకుంటున్నారని ఈటల వర్గం ప్రచారం కూడా చేసుకుంటోంది.
Also Read : ఈటలకు బండి చెక్ – తారాస్థాయికి వర్గపోరు
డీకే అరుణ, ఈటల రాజేందర్ లు మాత్రమే కాదు. బీజేపీలో సీఎం పీఠాన్ని ఆశిస్తోన్న వారు చాలామందే ఉన్నారు. బండి సంజయ్ , కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి వారు కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు. సాధారణంగా బీజేపీలో ఎన్నికలకు ముందు సీఎం ఎవరన్నది అధినాయకత్వం ప్రకటించదు. కాని తెలంగాణ నేతలు మాత్రం ఈ విషయం తెలిసి కూడా సీఎం నేనంటే.. నేనే చెప్పుకోవడం చూసి పార్టీ క్యాడర్ ముక్కున వేలేసుకుంటోంది.
పిల్ల పుట్టకముందే శిశువుకు పేరు పెట్టుకున్నట్లుందని తెలంగాణ బీజేపీ నేతల తీరును తప్పుబడుతున్నారు.
Also Read : కాంగ్రెస్ కు మద్దతుగా ఈటల – పార్టీ మార్పు ఖాయమేనా..?