వరుసకు వారిద్దరూ అన్నాచెల్లెళ్ళు. కాని వావివరసలను పట్టించుకోకుండా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో ఇద్దరినీ హెచ్చరించారు. దాంతో ఇద్దరు కలిసి జీవించడం సాధ్యం కాదని.. విడిపోయి ఉండలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. నిజ జీవితంలో కలిసి ఉండకపోయిన చావులో మాత్రం ఇద్దరు కలిసే చావాలని నిర్ణయించుకొని రైలు కిందపడి పడి సూసైడ్ చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన తెలంగాణా రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని చేగుంట – కృష్ణ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఏపీలోని కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం దానాల, పర్లాపల్లి గ్రామాలకు చెందిన 70కుటుంబాలు పత్తి చెల్లో పని చేసేందుకు తెలంగాణకు వలస వచ్చాయి. చేగుంటకు వచ్చి అక్కడే తాత్కాలిక గుడారాలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈరమ్మ – మున్నెల్ల దంపతులకు మణికుమార్ (25) అనే కుమారుడు, శాంతమ్మ – కేశవల కుమార్తె అనిత (15)లు వరుసకు అన్నా చెల్లెళ్లు అవుతారు. అయినప్పటికీ వారిద్దరూ గత కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు.
విషయం మణికుమార్, అనిత కుటుంబాలకు తెలియడంతో వారిని మందలించారు. వారి ప్రేమ విషయంలో కుటుంబాలను కన్విన్స్ చేసే ధైర్యం లేక, కుటుంబ సభ్యులు అంగీకరించరని తెలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. అలా వారి ప్రేమ విషాదంతంగా ముగిసింది.