రేవంత్ రెడ్డి నాయకత్వంపై తిరుగుబావుటా ఎగరేసిన సీనియర్ల పరిస్థితి ఎటుకాకుండా అయిపోయింది. నేతల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు దిగ్విజయ్ సింగ్ వచ్చి వెళ్లారు కాని సమస్య ఇంకా సద్దుమణిగినట్లు లేదు. పైగా, రేవంత్ దూకుడును ప్రోత్సహించినట్లుగా దిగ్విజయ్ సింగ్ కామెంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భవిష్యత్ పై సీనియర్లు డైలమాలో పడిపోయారు. కాంగ్రెస్ లో గౌరవంగా ఉండాలంటే చచ్చినట్టు రేవంత్ చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. లేదంటే మరో పార్టీలో చేరాలి. ఇవి సీనియర్ల ముందున్న ఆప్షన్స్.
Also Read : అటు, ఇటు కాకుండా అయిపోయిన సీనియర్లు..!
అధిష్టానం దూతగా దిగ్విజయ్ సింగ్ ను పంపడంతో బెట్టు చేయాలని సీనియర్లు ఫిక్స్ అయ్యారు. తమ అసంతృప్తి ఢిల్లీని తాకిందని.. ఇక పంతం నెగ్గుతుందనుకున్నారు. పీసీసీ పదవి నుంచి రేవంత్ ను దించేయడమో , మాణికం ఠాగూర్ ను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ పోస్ట్ నుంచి తప్పించడమో చేసి పట్టు నిలుపుకోవాలనుకున్నారు. కాని అలాంటిదేమి లేదని దిగ్విజయ్ సింగ్ సందేశమిచ్చి వెళ్ళారు. తదుపరి సీనియర్లు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. రేవంత్ అంటేనే ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న సీనియర్లు పీసీసీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో పాల్గొనరు. కాని , వారిని ఏమాత్రం పట్టించుకోకుండా రేవంత్ తన పని తాను చేసుకుపోతున్నారు. పాదయాత్రకు కూడా రెడీ అవుతున్నారు.
Also Read : సీరియస్ ఇష్యూ – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై వేటు..?
డిగ్గీ రాజా వచ్చి వెళ్లిన తరువాత రేవంత్ వర్గం మరింత బలపడినట్లు అనిపిస్తోంది. రేవంత్ ను కట్టడి చేయాలనుకున్న సీనియర్లు పార్టీకి దూరమయ్యారు. పార్టీ కార్యకర్తల చేత ఛీ కొట్టించుకుంటున్నారు. ఇప్పుడు వారంతట వారే తగ్గి రేవంత్ చెప్పినట్లు నడుచుకుంటే పార్టీలో చులకన ఐపోతారు. అలాగని పార్టీలో కొనసాగినా కార్యకర్తల నుంచి ఆదరణ దక్కే సూచనలేవి కనిపించడం లేదు.
Also Read : కాంగ్రెస్ పై కోవర్ట్ ఆపరేషన్ – రంగంలోకి ఎర్రబెల్లి
పార్టీమని వీడి మరో పార్టీలో చేరితే అక్కడ ఎలా ఉంటుందో చెప్పలేం. కాంగ్రెస్ లోనున్న స్వేఛ్చ, సీనియార్టీ అక్కడ ఉండదు. బీజేపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి కాని, బీజేపీలో చేరిన కొంతమంది నేతలే ఎలాంటి పదవులు లేక ప్రాధాన్యత లేని నేతల్లా మిగిలిపోయారు. టీఆర్ఎస్ లో చేరుదామనుకున్నా కారు పార్టీ ఓవర్ లోడ్ తో ఉంది. అందుకే ఇప్పుడు సీనియర్ల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.
Also Read : ఆ సీనియర్లు గంపగుత్తగా బీజేపీలోకి వెళ్లనున్నారా..?