కేంద్ర ఆర్ధిక శాఖ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిర్మలా సీతారామన్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని సమాచారం. ఓ ప్రైవేట్ వార్డులో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా, వార్షిక వైద్య పరీక్షల కోసమే నిర్మలా సీతారామన్ ఆసుపత్రిలో చేరినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పరీక్షల అనంతరం మంత్రిని డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.