తెలంగాణ కేబినేట్ ను పునర్ వ్యవస్థీకరించే అవకాశముందా…? ఇందుకు సంబంధించిన కసరత్తును కేసీఆర్ ప్రారంభించారా..? సంక్రాంతి తరువాత లేదా ఫిబ్రవరి మొదటివారంలో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలనుకుంటున్నారా..? ఇదే జరిగితే కేసీఆర్ ఎవరిపై వేటు వేయనున్నారు..? ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు..? అనేది రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Also Read : బీజేపీకి టచ్ లో మంత్రి మల్లారెడ్డి -వేటు వేసేందుకు కేసీఆర్ రెడీ..?
త్వరలో కేబినేట్ ను పునర్ వ్యవస్థీకరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. గత ఎన్నికల తరువాత ఒకసారి మాత్రమే కేబినేట్ పునర్ వ్యవస్థీకరణ చేశారు. హరీష్ రావుతోపాటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఆ తరువాత ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పించి ఆయన శాఖను హరీష్ రావుకు అదనంగా కేటాయించారు.
Also Read : కేసీఆర్ కూతురికి కొత్త సంవత్సరంలో కష్టాలే..!
ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయముంది. ఈ నేపథ్యంలోనే అసంతృప్త నేతలను శాంతింపజేయడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించడం మేలు చేస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. హరీష్ రావు నిర్వహిస్తోన్న అదనపు శాఖలను త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ద్వారా కొత్తవారికి కట్టబెట్టాలని కేసీఆర్ అనుకుంటున్నారు. సంక్రాంతి తరువాత లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఇందుకు ముహూర్తం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read : కవిత అరెస్ట్ తథ్యం – మరి బీజేపీపై బీఆర్ఎస్ బాస్ ఏం చేయనున్నారు..?
ప్రస్తుత కేబినేట్ లోనున్న నలుగురు మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు, భూకబ్జా ఆరోపణలు ఉండటంతో వారిని తప్పిస్తేనే మంచిదనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చారని అంటున్నారు. గ్రేటర్ కు చెందిన మల్లారెడ్డితోపాటు మరో మంత్రిపై వేటు వేస్తారని, కరీంనగర్ జిల్లాకు చెందిన కొప్పుల లేదా గంగులలో ఎవరో ఒకరిని తప్పించనున్నారు. వీరి పనితీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ముగ్గురు లేదా నలుగురు మంత్రుల స్థానాలను కొత్తవారితో భర్తీ చేసేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు ప్రగతి భావన వర్గాల సమాచారం.
Also Read : కరోనా ఫియర్ – ఇండియాలో మరోసారి లాక్ డౌన్ ఉంటుందా..?
మాజీ స్పీకర్ మధుసూదనాచారి, కడియం శ్రీహారి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ , బండా ప్రకాష్ పేర్లు మంత్రి పదవుల రేసులో కనిపిస్తున్నాయి. సంక్రాంతి తరువాత మంచి ముహూర్తాలు ఉండటంతో ఆ తరువాత ఎప్పుడైనా కేబినేట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉందన్న వార్తలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం లాబియింగ్ చేస్తున్నారు.