ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కీలక నిందితుడు నందకుమార్ ను విచారించేందుకు ఈడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. రెండు రోజుల విచారణకు కోర్టు అంగీకరించింది.ఈ కేసులో నందకుమార్ ను ప్రశ్నించడం ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఈడీ భావిస్తోంది. ఈ నెల 26,27 తేదీలలో చంచల్ గూడ జైల్లోనే నందకుమార్ ను ప్రశ్నించనున్నారు.
బీజేపీలో చేరితే వంద కోట్లు ఇస్తానని నందకుమార్ ప్రలోభ పెట్టారని.. ఆయన వెనక బీజేపీ పెద్దల హస్తం ఉందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసును చేదించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సిట్ దర్యాప్తు నిలిచిపోయింది.
Also Read : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు – వందల కోట్ల లెక్క తేల్చే పనిలో ఈడీ
ఈ కేసు ఏసీబీ పరిధిలోకి వస్తుందన్న వాదనలు ఉన్నాయి. కాబట్టి ఏసీబీ దర్యాప్తు చేయాలా..? సిట్ చేయాలా అన్నదానిపై హైకోర్టులో విచారణ జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, నందకుమార్ , పైలెట్ రోహిత్ రెడ్డి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నట్లు తేలడం పలు సందేహాలను లేవనెత్తింది. వీరి మధ్య ఆర్ధిక లావాదేవీలు కూడా జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే రోహిత్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ.. తాజాగా నందకుమార్ ను ప్రశ్నించేందుకు రెడీ అయింది.
నందకుమార్ విచారణ పూర్తైన తరువాత మరోసారి పైలెట్ రోహిత్ రెడ్డిని కూడా ఈడీ విచారించనుంది. దీంతో ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read : కేసీఆర్ కూతురికి కొత్త సంవత్సరంలో కష్టాలే..!