నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మృతి చెందిన వార్తను మరవకముందే టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.ప్రముఖ నటుడు చలపతిరావు(78)హఠాన్మరణం చెందారు. ఆదివారం ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.
1944 మే8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో జన్మించిన చలపతిరావు.. నటుడు, నిర్మాతగా గుర్తింపు పొందారు. ఆరు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. 1966లో విడుదలైన గూఢచారి 116 సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. స్టార్ హీరోలందరి సినిమాలో నటుడిగా, విలన్ గా నటించి ఎన్నో ప్రశంసలను అందుకున్నారు.
Also Read : దివికేగిన నవరస నటనా సార్వభౌముడు
చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఉన్నారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని రవి బాబు ఇంట్లోనే చలపతిరావు ఉంటున్నారు. ఉన్నట్టుండి ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలి కన్నుమూశారు.
చలపతిరావు ఆకస్మిక మరణంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరలంటూ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. అమెరికాలో ఉంటున్న చలపతిరావు కుమార్తె హైదరాబాద్ వచ్చిన అనంతరం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.