దేశాన్ని ఐక్యం చేసేందుకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కు వరకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనతో సోనియా గాంధీ కూడా చేరారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. దేశానికి ప్రేమను పంచడం తన తల్లి నుంచే నేర్చుకున్నానని పేర్కొన్నారు.
Also Read : భారత్ జోడో యాత్రపై కేంద్రం ‘కరోనా’ కుట్రలు
భారత్ జోడో యాత్రకు శనివారంతో తాత్కాలిక బ్రేక్ పడనుంది. వాహనాలు నిర్వహణకు ఇవ్వనున్నారు, దాదాపు ఎనిమిది రోజుల విరామం తరువాత భారత్ జోడో యాత్ర వచ్చే నెల మూడో తేదీ నుంచి పునః ప్రారంభం కానుంది. ఇక, భారత్ జోడో యాత్ర ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా వేలమంది ఈ యాత్రలో భాగస్వామ్యం అయ్యారు.
जो मोहब्बत इनसे मिली है,
वही देश से बांट रहा हूं। pic.twitter.com/y1EfLqxluU— Rahul Gandhi (@RahulGandhi) December 24, 2022
Also Read : యాత్ర.. ఫర్ చేంజ్ పేరుతో రేవంత్ పాదయాత్ర
BF7కొత్త వేరియంట్ నేపథ్యంలో భారత్ జోడో యాత్రను ఆపేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం లేఖ రాసింది. యాత్ర కొనసాగింపుకే మొగ్గు చూపితే కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. జోడో యాత్రకు ప్రజాదరణ చూసి ఓర్వలేకే కరోనా సాకును వెతుక్కుందని ఆరోపించారు.