చైనాను హడలెత్తిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండటంతో చైనా అల్లకల్లోలంగా మారింది. డ్రాగన్ కంట్రీలో కరోనా కేసులు ప్రపంచ దేశాలను బెంబేలేత్తిస్తుండగా.. జపాన్, దక్షిణ కొరియా, అమెరికాల్లో కూడా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
Also Read : కోరలు చాచిన కరోనా – ఒక్కరోజే పది లక్షల కేసులు
భారత ప్రధాని నరేంద్ర మోడీ అద్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం అంతంత మాత్రంగానే ఉందని అయినప్పటికీ కోవిడ్ నిబంధనలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన మునుపటి పరిస్థితులు తలెత్తుతాయని రాష్ట్రాలను హెచ్చరించింది.
Also Read : మళ్ళీ కరోనా ఆంక్షలు – మాస్కులు ధరించాల్సిందే
చైనాలో నెలకొన్న పరిస్థితితో తూర్పు ఆసియా దేశాలు భయపడుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికులను విమానాశ్రయంలోనే ఉంచి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇండియా కూడా ఇదే విధానం అనుసరించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవియా శుక్రవారం అన్ని రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ మంత్రులతో సమావేశమై ఆయా రాష్ట్రాల్లో నమోదు అవుతోన్న కరోనా కేసులు, దాని ప్రభావం గురించి అడిగి తెలుసుకొని సూచనలు చేశారు.
Also Read : కరోనా డేంజర్ బెల్స్ – రాష్ట్రాలకు కేంద్రం బిగ్ అలర్ట్
ఇండియాలో వ్యాప్తి చెందుతోన్న బీఎఫ్.7
BF.7 వేరియంట్ దేశంలోనూ నెమ్మదిగా వ్యాప్తి చెందుతోంది. అన్ని దేశాల్లోనూ ఈ వేరియంట్ వ్యాప్తి కనిపిస్తోంది. మన దేశంలో ఇప్పటివరకు ఈ వేరియంట్ కేసులు నాలుగు నమోదయ్యాయి. అలాగే గత 24 గంటల్లో 201 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, రికవరీ రేటు 98.8 శాతం ఉండడం ఊరటనిస్తోంది.
Also Read : చైనాలో పెరుగుతోన్న కేసులతో మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదా..?