తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష ప్రదర్శిస్తుందని.. మోడీ సర్కార్ తీరును ఎండగట్టేందుకు డిసెంబర్ లో అసెంబ్లీని సమావేశపరచాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. వారం రోజులపాటు శాసన సభ సమావేశాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు కూడా ప్రకటించాయి. డిసెంబర్ చివరి వారం వచ్చింది కాని, అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ను మాత్రం ప్రకటించలేదు. దీంతో సభ సమావేశాల నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది.
కేంద్రం వల్ల తెలంగాణకు 40వేల కోట్ల ఆదాయం నష్టం జరిగిందని..తెలంగాణ పట్ల కేంద్రం వైఖరితో రాష్ట్ర అభివృద్ధికి అవరోధం ఏర్పడుతోందని , దీనిపై చర్చించాలని డిసెంబర్ నెలలో వారం రోజులపాటు ఉభయ సభలను నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. మొదటి వారంలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని లీకులు ఇచ్చారు కాని, చివరి వారం సమీపించిన ఇంతవరకు సభ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వ పెద్దలు స్పందించడం లేదు. క్రిస్మస్ తరువాత అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ప్రచారం జరుగుతోన్న.. ప్రస్తుతం కేంద్రం తీరును ఎండగట్టేందుకు కేసీఆర్ సిద్దంగా లేరు. కాబట్టి క్రిస్మస్ తరువాత కూడా సభ సమావేశాలు ఉండే అవకాశం లేదు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవిత చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోంది. జనవరి ఆరో తేదీన దాఖలు చేయనున్న కామన్ చార్జీషీట్ లో కవిత పేరును ప్రస్తావించనుంది. ఈ సమయంలో కేంద్రంపై కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అగ్రెసివ్ గా మాట్లాడితే కవితకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయని చెబుతున్నారు. అందుకే ముందుగా అనుకున్నట్లు సభ సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రాన్ని కడిగేయలనుకున్న కేసీఆర్ ప్రస్తుత పరిస్థితులతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.