ఢిల్లీ లిక్కర్ స్కాంలో అసలు రాజకీయం జనవరిలో మొదలు కాబోతోంది. ఇప్పటివరకు ఈడీ, సీబీఐలు విడివిడిగా చార్జీ షీట్ లు దాఖలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంతో సంబంధముందని భావిస్తోన్న ఒక్కొక్కరి పేరును చార్జీషీట్ లో చేర్చుతున్నారు. జనవరి ఆరో తేదీన ఈడీ కామన్ చార్జీషీట్ ను దాఖలు చేయనుంది. ఎలాగంటే..అన్ని చార్జీషీట్ లను కలిపి మొత్తం వ్యవహారాన్ని చేధిస్తూ ఒక చార్జీషీట్ దాఖలు చేయనుంది. ఇందులో అసలు నిందితులు ఎవరు..? కుట్రలు ఎవరెవరు ఎలా చేశారు..? పరోక్షంగా ఎవరైనా సాయమందించారా..? అనేది డిటెయిల్ గా ప్రస్తావించనున్నారు.
లిక్కర్ స్కాం కామన్ చార్జీషీట్ లో ఉండే పేర్లు.. నిందితులే ఫైనల్. అయితే, ఎఫ్ఐఆర్ లో ఏ1గా చేర్చిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా పేరును ఇప్పటివరకు నిందితుడిగా చేర్చలేదు. కవిత పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారు కానీ నిందితుల జాబితాలో చేర్చలేదు. మొత్తం ఆమె మద్యం వ్యాపారాన్ని నడిపించారని ఇటీవలి చార్జీషీట్ లో ఈడీ ప్రస్తావించింది. దీంతో నిందితుల జాబితాలో ఆమె పేరు ఉండటం ఖాయమే. ఇదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం కానుంది.
ఎలాంటి ఆధారాల్లెకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ నాయకుల పేర్లను చార్జీషీట్ లో చేర్చే అవకాశం లేదు. అలా చేస్తే రాజకీయ వేధింపులకు పాల్పడ్డారనే విమర్శలు వస్తాయి. దర్యాప్తు సంస్థలపై విశ్వసనీయత కూడా పోతుంది. మొత్తం ఆధారాలతో ఈ కేసును ఈడీ ముందుకు తీసుకేళ్తుతుంది . ఎలా చూసినా కవిత పేరు లిక్కర్ స్కాం నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉంది. ఈ లెక్కన జనవరిలో అసలు కథ ప్రారంభం కానుందని అర్థం అవుతోంది.