కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమోషన్ల కోసమే అధికారులు సర్కార్ కు సరెండర్ అవుతున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు టి. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీఎం కేసీఆర్ ప్రాపకం కోసం పూర్తిగా టీఆర్ఎస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త ఎస్కే ఆఫీసులో కాంగ్రెస్ సీనియర్లపై తప్పుడు పోస్టింగ్ లు సృష్టించబడ్డాయని సీవీ ఆనంద్ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పారు. సొంత పార్టీ నేతలపై వ్యతిరేక పోస్టింగులు అదే పార్టీకి చెందిన సోషల్ మీడియా టీం ఎందుకు సృష్టిస్తుంది..? తన కళ్ళను తనే పోడుచుకుంటారా ఎవరైనా..? సొంత పార్టీ నేతలను వీక్ చేస్తే ఆ పార్టీ ఎలా బలపడుతుంది..? రేవంత్ పై అగ్రహంగా ఉన్న సీనియర్లు ఈ విషయాన్ని పట్టించుకోరని అనుకున్నారో ఏమో కాని సీవీ ఆనంద్ కాంగ్రెస్ లో పంచాయితీకి కారణమయ్యారు.
సరే కాసేపు సీవీ ఆనంద్ చెప్పిందే నమ్ముదాం. ఎస్కే ఆఫీసుపై దాడి ఇష్యూ దర్యాప్తులో ఉంది. కేసు విచారణ దశలో ఉండగా అందుకు సంబంధించిన విషయాలను బయటపెట్టకూడదు. ఈ విషయం ఐపీఎస్ అధికారి అయిన సీవీ ఆనంద్ కు తెలియనిది కాదు. ఇవేవి పట్టించుకోకుండా ఈ విషయాన్ని చెప్పారంటే సీవీ ఆనంద్ ఎవరి పక్షమో అర్థం అవుతుంది. ఎస్కే ఆఫీసులో మీకు యాంటీగా పోస్టింగ్ లు సృష్టించారని ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీవీ ఆనంద్ చెప్పారు కాని, అందుకు సంబంధించిన ఆధారాలను బయట పెట్టలేదు. ఆధారాలుంటే బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సొంత పార్టీ నేతలపై తామెందుకు తప్పుడు ప్రచారం చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడైనా సీవీ ఆనంద్ అందుకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టి విశ్వసనీయత పెంచుకోవాలి. లేదంటే ఆయన్ను కేసీఆర్ ఏజెంట్ అనుకోవాల్సి వస్తుంది.
మీకో అనుమానం రావొచ్చు. కాంగ్రెస్ లో చిచ్చు రాజేస్తే సీవీ ఆనంద్ కొచ్చిన లాభం ఏంటని. మరి అక్కడే ఉంది కథంత. ఈ నెలలో మహేందర్ రెడ్డి డీజీపీ పదవి కాలం పూర్తి కానుంది. తరువాత పొలిసు బాస్ ఎవరన్న దానిపై సర్కార్ సమాలోచనలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో డీజీపీగా ఛాన్స్ కొట్టేయాలని, అందుకోసం కేసీఆర్ దగ్గర భేష్ అనిపించుకోవాలని సీవీ ఆనంద్ కాంగ్రెస్ లో లుకలుకలు రేపే ప్రయత్నాలు చేసినట్టు చెబుతున్నారు.
1 Comment
Pingback: వెర్రిపుష్పాలైన తొమ్మిది మంది సీనియర్లు - Polytricks.in