ఏదో చేయలనున్నారు. పార్టీని ఇరుకునపెట్టేసి పెత్తనం చెలాయించాలనుకున్నారు. కాని సీనియర్ల రాజకీయం పూర్తిగా రివర్స్ అయింది. సీనియర్ నేతల కుట్ర రాజకీయం వలన పార్టీ పూర్తిగా రేవంత్ చేతుల్లోకి వచ్చేసింది. సీనియర్లపై విశ్వాసం కోల్పోయిన హైకమాండ్, పార్టీ కార్యవర్గ సమావేశాలకు సీనియర్లు డుమ్మా కొట్టినా వాటి సమావేశాలు నిర్వహించాలని రేవంత్ ను ఆదేశించింది. ఈ సమావేశానికి అందరూ వచ్చారు కాని అసంతృప్తి గళం వినిపిస్తోన్న తొమ్మిది మంది మాత్రమే అటెండ్ కాలేదు. వారు మినహా మిగిలిన నేతలంతా రేవంత్ పైవే ఉన్నారని తేలిపోయింది.
సీనియర్ల కుట్ర రాజకీయాలపై హైకమాండ్ కు నివేదిక అందింది. వారు కావాల్సుకునే కాంగ్రెస్ పార్టీపై టీడీపీ ముద్రను వేస్తున్నారని గ్రహించింది. ఇటీవల ప్రకటించిన నూతన కమిటీలో 13మంది మాత్రమే టీడీపీ నుంచి వచ్చిన వారు ఉన్నారు. అయినప్పటికీ, 58మంది టీడీపీ నేతలకు ఈ కొత్త కమిటీలో చోటు కల్పించారంటూ సీనియర్లు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని, వారు మాట్లాడిన వీడియోలను ఏఐసీసీకు పంపారు. దీంతో వారి ఉద్దేశ్యాన్ని హైకమాండ్ అర్థం చేసుకొని, వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవద్దని డిసైడ్ అయిపొయింది. అందుకే పాదయాత్ర విషయంలో రేవంత్ కు అనుమతి ఇచ్చేసింది. జనవరి 26నుంచి పాదయాత్రతో జనాల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు.
Also Read : సీవీ ఆనంద్ పోలీసా..? కేసీఆర్ ఏజెంటా..?
ఇక నుంచి సీనియర్లు అపాయింట్ మెంట్ కోరినా ఇచ్చేది లేదని అధిష్టానం భావిస్తోంది. పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. 9మంది సీనియర్లు పార్టీని డ్యామేజ్ చేసి బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలోనే.. రాజగోపాల్ రెడ్డి సీనియర్లనుద్దేశించి అందరూ బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఒకరిద్దరు నేతలు బీజేపీకి టచ్ లో ఉన్నారన్న చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ కామెంట్స్ కు ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి , రేవంత్ కు కీడు చేయబోయి పార్టీని ఆయన చేతుల్లోనే పెట్టేసి సీనియర్లు వెర్రి పుష్పాలుగా మిగిలిపోయారు.
బీజేపీలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తూ పార్టీని బలహీనం చేయాలనుకుంటున్నారని అంచనా వేసే అధిష్టానం సీనియర్లను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది
బీజేపీ డైరక్షన్ లో దామోదర రాజనర్సింహ డ్రామాలు
ఫామ్ హౌస్ కేసు నిందితులతో దామోదర రాజనర్సింహ మంతనాలు
పార్టీ మార్పుపై గతంలోనే ముగ్గురు స్వామీజీలతో టచ్ లోకి
ఆ తరువాతే కాంగ్రెస్ ను అస్తవ్యస్తం చేసేలా ప్రకటనలు
గతంలో బీజేపీలో చేరిన దామోదర రాజనర్సింహ భార్య
భార్య బాటలోనే దామోదర రాజనర్సింహ..?
అందుకే సీనియర్లను రేవంత్ పైకి ఎగదోస్తున్న బీజేపీ కోవర్ట్
1 Comment
Revanth sir good