యాత్ర ఫర్ చేంజ్ పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. జనవరి 26న యాత్ర ప్రారంభమై తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలను స్పృశిస్తూ ఈ యాత్ర జూన్ 2న ముగియనుంది. దాదాపు ఐదు నెలలపాటు రేవంత్ యాత్ర కొనసాగనుంది. అయితే, యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించాలనే విషయంలో మూడు ప్లేసులు పరిశీలనలో ఉన్నాయి.
జోగులాంబ గద్వాల్, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం , ఆదిలాబాద్ జోడే ఘాట్. ఈ మూడింట్లో ఎదో ఒక ప్లేసు నుంచి రేవంత్ రెడ్డి యాత్రను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ రెడీ అవుతోంది. కాంగ్రెస్ కు గతంలో వెన్నుదన్నుగా నిలిచి, తెలంగాణ ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ వైపు మొగ్గిన సామజిక వర్గాలను తిరిగి పార్టీ వైపు టర్న్ చేసుకోవాలన్నది ఈ యాత్ర ప్రధాన లక్ష్యం. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, రెడ్డి సామజిక వర్గాలను మరోసారి కాంగ్రెస్ వైపు టర్న్ చేస్తే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడం ఖాయం. ఇందుకోసం ఆ సామజిక వర్గాలలో కాంగ్రెస్ పై పూర్వపు విశ్వాసాన్ని కల్గించేందుకు ఈ యాత్ర ఉపయుక్తంగా ఉంటుందని రేవంత్ భావిస్తున్నారు.
రేవంత్ పాదయాత్ర చేస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ ఓటు బ్యాంక్ మొత్తంగా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కేసీఆర్, రేవంత్ పాదయాత్ర రూట్ మ్యాప్ పై కసరత్తు చేస్తోన్న ఎస్కే ఆఫీసుపై పథకంలో భాగంగానే దాడి చేయించినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా, రేవంత్ పాదయాత్రకు పలుమార్లు అడ్డం పడుతోన్న సీనియర్లకు యాత్ర విషయం తెలిసే ఒకరోజు ముందు అసంతృప్తి గళాలను వినిపించినట్లు తాజాగా అర్థం అవుతోంది.
గతంలో రేవంత్ పై ఒక్కో సీనియర్ నేత అసంతృప్తి ప్రకటనలు చేస్తే హైకమాండ్ లైట్ తీసుకుంది. అందుకే రేవంత్ పై దండయాత్రగా వ్యతిరేక ప్రకటనలు గుప్పించడం వెనక యాత్రను అడ్డుకోవాలనే కుట్ర దాగి ఉన్నట్లు తాజాగా రూడీ అవుతోంది. ఈ క్రమంలోనే రేవంత్ పాదయాత్రకు రేపోమాపో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంచనా వేసే…ఒకరోజు ముందు ఎదో సాకును అడ్డం పెట్టుకొని సీనియర్లు రాజకీయ రచ్చను ప్రారంభించారు. అయినా, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా జనవరి 26నుంచి పాదయాత్ర చేసి తీరాలని రేవంత్ పట్టుదలగా ఉన్నారు.
అధిష్టానం సీనియర్లపై నమ్మకం పూర్తిగా కోల్పోయింది. వారు కోవర్టులన్న నమ్మకానికి వచ్చేసింది. అందుకే వారిని పట్టించుకోవడం దాదాపుగా మానేశారు. రేవంత్ రెడ్డికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రియాంకా గాంధీకి కూడా రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ పాదయాత్ర ప్రారంభానికి ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు.