మెగా అభిమానులకు గుడ్ న్యూస్. ఉపాసన, రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి అనౌన్స్ చేశారు.
ఈ విషయం పంచుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది. హనుమాన్ జీ ఆశీస్సులతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్న. ఉపాసన, రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కానున్నారు. ప్రేమతో మీ సురేఖ – చిరంజీవి కొణిదెల, శోభన, అనిల్ కామినేని అంటూ సంతోషం చాటుకున్నారు.
ఉపాసన , రామ్ చరణ్ లకు 2012లోనే వివాహం అయింది. ఈ ఏడాదితో పదేళ్లు అయింది. ఇప్పటికీ పిల్లలు లేకపోవడంతో అప్పుడప్పుడూ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కానున్నారని చాలాసార్లు వార్తలు వచ్చాయి. కాని ఈసారి మాత్రం అధికారికంగా చిరంజీవి ప్రకటించి మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశారు.