ఆర్జీవీ – అషూరెడ్డిలు ఒకే దగ్గర కూర్చుంటే ఏం జరుగుతుంది..? సె* సంబంధించిన వాటి గురించే ఎక్కువగా డిస్కషన్ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా అదే జరిగింది.
ఆర్జీవీ దర్శకత్వంలో ” డేంజరస్ మా ఇష్టం” అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. ఇక, ఈ మూవీ ప్రమోషన్ కోసం బోల్డ్ బ్యూటీతో ఆర్జీవీ చేసిన ప్రమోషన్ వీడియో ఒకటి యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇందులో ఇద్దరు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ రచ్చ రచ్చ చేశారు. నోటికి ఎంతోస్తే అంతగా వాగుతూ గబ్బు, గబ్బు చేసేశారు. సినిమా ప్రమోషన్ కోసమని చేసిన ఇంటర్వ్యూ కాస్త సె*పై అవగహన కోసం ఏర్పాటు చేసిన ఆన్ లైన్ క్లాస్ గా మారిపోయింది.
సినిమా విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా అషు తొడల గురించి ప్రశంసించడం కోసం ఇంటర్వ్యూ ఏర్పాటు చేసినట్లు అనిపించింది. ఆమె కుర్చీలో కూర్చోగా.. అషు పాదదాసిగా మారిపోయిన ఆర్జీవీ ఆమె శరీరాన్ని వర్ణిస్తూ పీక్స్ కు వెళ్ళిపోయాడు. నీ తొడలంటే నాకు పిచ్చి. కుర్చీలో కూర్చోకుండా కింద ఎందుకు కూర్చున్నావని అషు అడిగితే.. అందులో కూర్చుంటే ఐ టూ ఐ కాంటాక్ట్ ఉంటుంది. అదే కింద కూర్చుంటే నీ తొడలు చూసే మహా భాగం కల్గుతుంది కదా అంటూ చెప్పుకొచ్చాడు ఆర్జీవీ. ఇక, అషు కూడా తెగ్గేదేలే అంటూ రెచ్చిపోయింది. నా భక్తుడిగా కింద కూర్చుకున్న నీకు దేవతగా వరమివ్వాలి కదా అంటూ ఆర్జీవీకి ఆఫర్ ఇచ్చేసింది.
అషూ రెడ్డి కాలి వేళ్ళను అందుకొని ఆర్జీవీ నోట్లో పెట్టేసుకున్నాడు. నీ అందానికి నేను ఫిదా అయ్యాను.. నాకు ఈ అవకాశం ఇచ్చిన నీకు కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతలోనే అషూ పెళ్లి, భర్త అనే టాపిక్ తీసుకురాగా ఆర్జీవీ అంతలో అందుకొని వాట్ ద F***పెళ్లి చేసుకోవద్దంటూ సలహా ఇచ్చేశాడు. అందుకు అషూ కూడా నాకు కూడా పెళ్లి అంటే ఇష్టముండదని చెప్పేసింది. అంతలోనే ఆర్జీవీ అందుకొని మళ్ళీ అషూ తొడల గురించి భజన స్టార్ట్ చేసేశాడు. అందరూ కళ్ళు, బుగ్గలు అంటూ పొగుడుతారు కాని తొడలు ఎం చేశాయని వాటిని పట్టించుకోరంటూ తొడలపై తన ప్రేమను చాటుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమై నీకు తొడలు కావాలా..? అషూరెడ్డి మొత్తం కావాలా..? అని కోరితే అషూ తొడలే కోరుకుంటానంటూ సమాధానం చెప్పాడు.
దాంతో నువ్వు చెప్పేవన్నీ కామ సూత్రాలే అంటూ అషూ చేసిన వ్యాఖ్యలను ఆర్జీవీ ఖండించాడు. నేను చెప్పేది కామసూత్రం కాదు. ఇంకొకడు చెప్తేగాని కామం గురించి తెలుసుకోలేకపోతున్నాడు అంటే వాడు కామానికి అనర్హుడు అంటూ వర్మ లాజికల్ స్టేట్మెంట్ పాస్ చేశాడు. అందుకు అషూ వాహ్వా అంటూ చప్పట్లు కొట్టేసి ఆర్జీవీకి బూస్టింగ్ ఇచ్చింది.
అషూ సె* గురించి- ప్రేమ గురించి కూడా కామెంట్స్ చేసింది. ప్రేమలో ఉన్న ఎమోషన్ గొప్పనా..? సె* లో ఉండే ఎమోషన్ గ్రేటా అంటూ మాట్లాడింది. సె* అయితే 10 నిమిషాల్లో ముగించేస్తారని.. ఇంకా మహా అయితే అరగంటలో చేసేస్తారంటూ పచ్చిగా మాట్లాడింది. ప్రస్తుతం ఆర్జీవీ – అషూ రెడ్డిల వీడియో యూట్యుబ్ ను షేక్ చేస్తోంది.