టీఆర్ఎస్ కథ ఓడిసింది. ఆ పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారనుంది. ఇక నుంచి టీఆర్ఎస్ ఉనికిలో ఉండదు. బీఆర్ఎస్ మాత్రమే ఉంటుంది. దసరా రోజున టీఆర్ఎస్ కార్యవర్గం చేసిన తీర్మానాన్ని ఎన్నికల సంఘం తాజాగా ఆమోదిస్తూ లేఖ విడుదల చేసింది. కేసీఆర్ ఈ లేఖను ఆమోదిస్తూ సంతకం చేసి ఎన్నికల సంఘానికి పంపితే టీఆర్ఎస్ అంతర్ధానం అయినట్లే.
బంగారు తెలంగాణ ఎలాగైతే చేసానో , దేశాన్ని బంగారు భారత్ చేసేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు కేసీఆర్. అందుకే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మర్చుతున్నామని తెలిపారు. తెలంగాణ అనే పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే మెరుగైన ఫలితాలు రావన్ని తనకు అధికారం తెచ్చిపెట్టిన పదాన్ని కేసీఆర్ వదిలేశారు. మరి ఈ నిర్ణయం ఏరకమైన ఫలితం ఇస్తుందో కాలమే సమాధానం చెప్పనుంది.
బీఆర్ఎస్ కు అన్ని అనుమతులు వచ్చేశాయి. ఇది మిగిలింది కేసీఆర్ జాతీయ స్థాయికి వెళ్ళడమే. పార్టీ పేరు మారుతుందని ప్రకటించారే కాని, ఇప్పటివరకు బీఆర్ఎస్ జెండా , ఎజెండాలను ప్రకటించలేదు. త్వరలోనే ఢిల్లీలో భారీ బహిరంగ సభ పెట్టి బీఆర్ఎస్ విధి, విధానాలను ప్రకటించనున్నారు కేసీఆర్.
పార్టీ పేరు మారింది కాని, కారు గుర్తే ఎన్నికల గుర్తుగా ఉండనుంది. రంగును కూడా గులాబీ రంగును కొనసాగిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.