వైఎస్ షర్మిల అరెస్ట్ పై ఆమెకు రాజకీయాలకతీతంగా సంఘీభావం వ్యక్తం అయింది. ఏకంగా ప్రధాని మోడీ వైఎస్ షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించారు కాని, సొంత అన్నయ్య, ఏపీ సీఎం జగన్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం చర్చనీయాంశం అయింది. దీనిపై షర్మిల స్పందిస్తూ తనకు మద్దతు తెలిపిన వాళ్ళకు కృతజ్ఞతలు, చెప్పని వాళ్ళకు డబుల్ కృతజ్ఞతలు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది జగన్ నుద్దేశించేనని చెప్పాల్సిన పనిలేదు. చెల్లిని అవమానకరంగా అరెస్ట్ చేస్తే జగన్ ఎందుకు నోరు విప్పలేదన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
జగన్ ఏమాత్రం ముందు వెనక ఆలోచించకుండా నోరు ఎత్తితే ఆయనకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. జైలు గోడలు ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇప్పటికే ఉన్న కేసులతో జగన్ లో భయం మిణుకు మిణుకుమంటుంది. అందుకే ఏపీ ప్రయోజనాల విషయంలో జగన్ గట్టిగా నిలదీయడం లేదు. స్వంత రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నోరు విప్పడం లేదంటే కేసుల భయంతో జగన్ సైలెంట్ గా ఉన్నారనుకోవచ్చు..మరి కేసీఆర్ కు వ్యతిరేకంగా చెల్లికి సపోర్ట్ గా మాట్లాడేందుకు వచ్చిన ఆయనకొచ్చిన సమస్య ఏంటన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు..?
కేసీఆర్ కు కూడా జగన్ భయపడుతున్నారా..? కేసీఆర్ కూడా తన విషయంలో రాజకీయం చేస్తే కేసులు బయటకు వస్తాయని ఆందోళన చెండుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జగన్ ఆస్తులన్నీ హైదరాబాద్ సెంటర్ గానే ఉన్నాయి కాబట్టి.. సొంత చెల్లిని అవమానకర రీతిలో కేసీఆర్ సర్కార్ అరెస్ట్ చేస్తే జగన్ మౌనం ఆశ్రయించారని అంటున్నారు. పైగా, ఏపీలో జగన్ గెలుపుకు టీఆర్ఎస్ సాయం చేసింది. ఇప్పుడు చెల్లి కోసం టీఆర్ఎస్ తో వైరం పెట్టుకుంటే లేనిపోనీ ఇబ్బందులు వస్తాయని జగన్ భయంగా తెలుస్తోంది.
జగన్ జైలుకు వెళ్ళిన సమయంలో అన్నయ్యకు అండగా నిలిచిన షర్మిలకు ప్రస్తుతంసంఘీభావం చెప్పకపోవడంతో జగన్ వైఖరి బ్యాడ్ గా ప్రొజెక్ట్ అవుతుంది. ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉన్నది.