ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయన గుండెపోటుకు గురయ్యారు. ఆస్ట్రేలియా – వెస్టిండిస్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ లో కామెంటరీ చెప్తుండగా పాంటింగ్ కు చాతిలో నొప్పి వచ్చింది. దాంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ రికీ పాంటింగ్ కు గుండెపోటు వచ్చిందని తెలుసుకొని క్రికెట్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
గుండెపోటుకు గురైన పాంటింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. పాంటింగ్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
1995నుంచి 2012వరకు 17 ఏళ్లపాటు ఆస్టేలియాకు పాంటింగ్ ప్రాతినిధ్యం వహించారు. 198టెస్టు మ్యాచ్ లో 13,378 పరుగులు చేయగా ఇందులో 41 శతకాలు ఉన్నాయి. 375వన్డే మ్యాచ్ లో 13,704పరుగులు చేయగా ఇందులో 30సెంచరీలు బాదాడు. ఆస్ట్రేలియా సారధిగా రెండు ప్రపంచ కప్ లను అందించిన ఘనత పాంటింగ్ దే.